జనసేన(Jana Sena) పెద్దలతో దిగిన ఫొటోలు చూపిస్తూ సబ్సిడీ రుణాలు (Subsidy Loans) ఇప్పిస్తానని అమాయక జనం నుంచి భారీగా వసూళ్లకు తెరలేపాడు జనసేన నాయకుడు. చిత్తూరు జిల్లా(Chittoor District) జీడీ నెల్లూరు జనసేన ఇన్‌చార్జ్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్‌పై(Yugandhar) పలువురు బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పీఎంఈజీపీ పథకం (PMEGP Scheme) కింద రూ.10 లక్షల సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జనసేన సభ్యత్వాన్ని బట్టి వసూళ్లు
జనసేన పార్టీ సభ్యత్వం (Janasena Party Membership) లేని వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, పార్టీ సభ్యత్వం ఉన్న వారి నుంచి రూ.2,100 చొప్పున వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వందలాది మంది ఈ వ్యవహారంలో బాధితులుగా ఉన్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
జనసేన(Jana Sena), టీడీపీ(TDP) పెద్దలతో తనకున్న పరిచయాలు, వారితో దిగిన ఫొటోలను చూపించి సబ్సిడీ రుణాలు సులభంగా ఇప్పించగలనని నమ్మించినట్లు బాధితులు ఆరోపించారు. రుణాలు ఇప్పిస్తాననే హామీతో డబ్బులు తీసుకున్నప్పటికీ, తమకు అనుకున్న విధంగా రుణాలు అందలేదని వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
జనసేన నేతల నుంచే ఫిర్యాదు
ఈ వ్యవహారంపై జనసేన పార్టీకి చెందిన మండల స్థాయి నేతలు సైతం యుగంధర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాల కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న యుగంధర్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు. ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, ఆరోపణల్లో వాస్తవాలు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని ఎస్పీని ఆదేశించినట్లు తెలుస్తోంది.
అధికార అండతో కూటమి పార్టీ నాయకుడు వసూళ్లకు పాల్పడడం సంచలనంగా మారింది. రుణాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌పై చర్యలుంటాయా.. లేదా అనేది వేచి చూడాలి.








‘డీఎస్సీ’లో గట్టిగా ఇరుక్కున్నారు.. తప్పించుకోలేరు