మణుగూరులో గ్యాంగ్‌వార్‌ హత్య.. 23 మంది అరెస్ట్

మణుగూరులో గ్యాంగ్‌వార్‌ హత్య.. 23 మంది అరెస్ట్

Summarize with AI

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) మణుగూరులో (Manuguru) సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ‌త‌ నెల 27న మణుగూరు నేతాజీ గ్రౌండ్‌లో (Netaji Ground) జరిగిన శివ హత్య కేసులో (Shiva Murder Case) మొత్తం 27 మంది నిందితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి (Vanga Ravinder Reddy) వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుడు శివకు(Shiva), ఎం.కే. గ్యాంగ్‌ (M.K. Gang) గ్రూప్‌ సభ్యులకు మధ్య కొంతకాలంగా వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఈ వివాదాలే హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. రాఖీ పండుగ (Rakhi festival) సందర్భంగా మణుగూరుకు వచ్చిన శివను మాట్లాడుకుందామని చెప్పి నేతాజీ గ్రౌండ్‌కు పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడికి చేరుకున్న శివపై నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ వెల్లడించారు.

ఈ కేసులో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించగా.. ఇప్పటివరకు 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌ నిమిత్తం ఖమ్మం సబ్‌ జైలుకు (Khammam Sub Jail) తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు. నిందితులంతా మణుగూరుకు చెందినవారేనని పోలీసులు వెల్లడించారు. కేవలం పార్టీల పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ గ్యాంగ్‌వార్‌ హత్యలో నిందితులు గంజాయి వంటి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే అనుమానాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే విచారణలో నిందితులు గంజాయి (ganja) లేదా ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment