మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Summarize with AI

హైదరాబాద్‌లోని(Hyderabad) ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ (MCR HRD) బోధి పెవిలియన్‌లో(Bodhi Pavilion) మూసీ ప్రాజెక్టుపై (Musi Project) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం భూసేకరణ (Land Acquisition) ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్‌ పూలింగ్‌పై (Land Pooling) స్పష్టమైన విధానం రూపొందించాలని, ఎఫ్‌టీఎల్‌(FTL), బఫర్‌ జోన్‌(Buffer Zone), అసైన్డ్‌ భూముల సేకరణకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సూచించారు. భూసేకరణలో భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్‌-2కు (Musi Project Phase-2) వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో లభించే రుణాలపై మున్సిపల్‌ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు.

టీఆర్‌డీ (TDR) అంశంపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయానికి(Onkareshwara Swamy Temple) సంబంధించిన పనులకు తక్షణమే టెండర్లు పిలవాలని, కొత్వాల్‌గూడ బర్డ్స్‌ పార్క్‌కు మరింత ప్రచారం కల్పించాలని సూచించారు. మూసీ ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేలా శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(Sarfaraz Ahmed), జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, సైబరాబాద్‌ కమిషనర్‌ సృజన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ మను చౌదరి, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ ఈ.వి. నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment