తిరుపతిలో చికిత్స పొందుతూ శ్వేత ఘోష్ మృతి

తిరుపతిలో చికిత్స పొందుతూ శ్వేత ఘోష్ మృతి

Summarize with AI

తిరుపతిలో(Tirupati) విషాద ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే (TDP MLA) థామ‌స్‌కు(Thomas) చెందిన చెన్నైలోని (Chennai) ఓ ఫెర్టిలిటీ సెంటర్‌లో(Fertility Centre) పనిచేస్తున్న శ్వేత ఘోష్ (Swetha Ghosh) ఆత్మహత్యాయత్నం అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆస్ప‌త్రి అడ్మినిస్ట్రేటివ్ బెదిరింపులు(Hospital Administration), వేధింపుల (Harassment) కార‌ణంగానే ఈనెల 13వ తేదీన 13న చెన్నైలోని సి.ఎఫ్.సి భవనం (CFC Building) నాలుగో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆరోప‌ణ‌లున్నాయి.

వివ‌రాల్లోకి వెళితే.. శ్వేతా ఘోష్ గత ఏడేళ్లుగా టీడీపీ ఎమ్మెల్యే థామ‌స్‌కు చెందిన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్‌లో బెంగాలీ తదితర భాషలకు ట్రాన్స్‌లేటర్‌గా (Translator) పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు ట్రాన్స్‌లేటర్‌గా విధులు నిర్వహిస్తోంది.

శ్వేత ఘోష్ పనిచేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్‌కు ఐవీఎఫ్ చికిత్స(IVF Treatment) కోసం బంగ్లాదేశ్‌కు చెందిన కల్పన(Kalpana) అనే మహిళ వచ్చింది. ట్రాన్స్‌లేష‌న్ స‌మ‌యంలో చికిత్సకు సంబంధించిన సుమారు రూ.2 లక్షల బిల్లు, ఫీజుల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. రోగికి ఫీజులు, బిల్లింగ్ వివరాలను వివరించే సమయంలో శ్వేత ఘోష్ వైపు నుంచి కమ్యూనికేషన్‌లో లోపం ఏర్పడింద‌ని ఆస్పత్రి వర్గాల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి.

ఈ వ్యవహారానికి సంబంధించి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి చెందిన మేనేజర్లు ఆంటోనీ(Antony), బాలు(Balu).. శ్వేత ఘోష్‌ను బెదిరించినట్లు స‌మాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఫెర్టిలిటీ సెంటర్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంట‌నే శ్వేత ఘోష్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటనకు సంబంధించి చెన్నై అమీంజికరై పోలీసులు ఎఫ్‌ఐఆర్ 42/2026 కింద కేసు నమోదు చేశారు.

చెన్నైలో ఘటనకు సంబంధించిన విషయం మీడియా దృష్టికి రాకుండా ఉండేందుకు, మెరుగైన వైద్యం పేరుతో ఈ నెల 20న శ్వేత ఘోష్‌ను తిరుపతిలోని అమర హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె నిన్న రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందారు. శ్వేత ఘోష్ మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

అయితే శ్వేత ఘోష్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఏమిటి? బిల్లింగ్ వివాదంలో ఆస్పత్రి సిబ్బంది నుంచి నిజంగానే బెదిరింపులు ఎదురయ్యాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment