విశాఖలో విషాదం.. టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి!

విశాఖలో విషాదం.. టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి!

Summarize with AI

విశాఖపట్నంలో(Visakhapatnam) విషాదకర ఘటన చోటుచేసుకుంది. హోంవర్క్(Homework) చేయలేదన్న కారణంతో ఓ ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్ (Private School Teacher) విద్యార్థిని (Student) కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందిన ఘ‌ట‌న‌ తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖ వన్‌టౌన్‌లోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో(Little Garden School) ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మృతుడు చిన్నారి ప్రణయ్ తేజ‌(Pranay Teja) బంధువులు కేజీహెచ్‌ (KGH) వద్ద ఆందోళనకు దిగారు. బాలుడిపై టీచ‌ర్ దాడికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్రణయ్‌ తేజ హోంవర్క్ చేయలేదని టీచర్ భ‌య‌పెడుతూ చెంప‌పై గ‌ట్టిగా ఒక దెబ్బ వేసింది. ఉద‌యం 11:20 గంటల సమయంలో ఘ‌ట‌న జ‌ర‌గ్గా.. క్లాస్ రూమ్‌లోనే బాలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతరం ప్రణయ్‌ తేజను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పాఠశాల సిబ్బంది బాలుడిని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్‌)కు తీసుకువచ్చారు.

కేజీహెచ్‌కు తీసుకొచ్చిన వెంటనే వైద్యులు బాలుడికి ఈసీజీతో (ECG)పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. టీచర్ దాడి కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ కేజీహెచ్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment