గాలె టెస్టులో టీమిండియా ఘన విజయం.. శ్రీలంకపై 165 పరుగుల తేడాతో గెలుపు

గాలె టెస్టులో టీమిండియా ఘన విజయం.. శ్రీలంకపై 165 పరుగుల తేడాతో గెలుపు

Summarize with AI

శ్రీలంకతో(Sri Lanka) గాలె (Galle) వేదికగా జరిగిన తొలి టెస్టులో(First Test) టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు (Indian Bowlers) 206 పరుగులకే ఆలౌట్ చేయడంతో భారత్ 165 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ధనంజయ డి సిల్వ 59(Dhananjaya de Silva), సోనల్ దినూష (Sonal Dinusha) 84 పరుగులతో పోరాడినా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ (Manav Suthar) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన సుతార్.. మ్యాచ్‌లో మొత్తంగా 10 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు.

ఈ విజయంతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలోనూ కీలక పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత్ 10 టెస్టుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రాతో 64 పాయింట్లు, 53.33 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 77.78 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 75 శాతంతో రెండో, న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో, బంగ్లాదేశ్ 66.67 శాతంతో నాలుగో స్థానాల్లో ఉన్నాయి. గాలె టెస్టులో తొలుత భారత్ 462 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ (Rishabh Pant) 66 పరుగులతో రాణించడంతో భారత్ శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ విజయంతో టాప్-4కు చేరువైన టీమిండియా.. WTC ఫైనల్ రేసులో ముందుకు సాగాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే స్థాయి ప్రదర్శన కొనసాగించాల్సి ఉంటుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment