భారత సైన్యంలో నియామకాల కోసం నేపాల్ యువత రోడ్డెక్కిన వేళ!

భారత సైన్యంలో నియామకాల కోసం నేపాల్ యువత రోడ్డెక్కిన వేళ!

Summarize with AI

భారత సైన్యంలో (Indian Army) చేరేందుకు అవకాశం కల్పించాలని, ‘అగ్నిపథ్’(Agnipath) పథకం కింద నేపాల్ (Nepal) యువత నియామకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పోఖరాలో (Pokhara) మాజీ గోర్ఖా సైనికులు(Ex-Gorkha Soldiers), వారి కుటుంబాలు, యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ‘ఇండియన్ ఎక్స్-సర్వీస్‌మెన్ గోర్ఖా బ్రిగేడ్ నేపాల్’(Indian Ex-Servicemen Gorkha Brigade Nepal) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో నేపాల్ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. అగ్నిపథ్ నియామకాలతో పాటు మాజీ సైనిక సంస్థల పేర్లలో ‘సైనికుడు’ (Soldier) అనే పదాన్ని ఉపయోగించే గుర్తింపును పునరుద్ధరించాలని కోరారు.

నేపాల్ గోర్ఖాలు (Nepalese Gorkhas) దశాబ్దాలుగా భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. 2020లో కరోనా కారణంగా నియామకాలకు విరామం ఏర్పడగా.. 2022లో భారత్ తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానం కొత్త వివాదానికి కారణమైంది. నాలుగేళ్ల సేవ, ఆ తర్వాత 25 శాతం మందికే పూర్తిస్థాయి సర్వీస్ అవకాశం వంటి నిబంధనలపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, గోర్ఖా యువతకు భారత సైన్యంలో ఉద్యోగం మెరుగైన ఉపాధి అవకాశమని మాజీ సైనికులు చెబుతున్నారు.

అగ్నిపథ్ విషయంలో భారతీయులకు(Indians), నేపాల్ పౌరులకు (Nepalese Citizens) వేర్వేరు నిబంధనలు ఉండవని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. తుది నిర్ణయం నేపాల్ ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదే సమయంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ (General Dheeraj Seth) నేపాల్‌లో ఐదు రోజుల పర్యటనకు వెళ్లనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గోర్ఖా నియామకాల అంశం పరిష్కారం కాకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని మాజీ సైనికులు, యువత హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment