నిలదీస్తేనే సోయి వస్తుందా? రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

నిలదీస్తేనే సోయి వస్తుందా? రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

Summarize with AI

బీఆర్ఎస్(BRS) నిలదీస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సోయి వస్తుందా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు (Telangana) సంబంధించిన ఏడు ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ ఏపీ ప్రభుత్వం (AP Government) గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) ఎజెండాలో ప్రతిపాదించినప్పటికీ.. ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతే హడావుడిగా లేఖలు రాస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో లేఖలతో పనులు కావని, రాజీలేని పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 18న హైదరాబాద్‌లో(Hyderabad) జరిగే GRMB సమావేశం నుంచి ఏపీ ప్రతిపాదించిన అంశాలను వెంటనే తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆ అంశాలను వెనక్కి తీసుకోకపోతే సమావేశానికి హాజరుకాబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రాజెక్టులపై(Telangana Projects) ఏపీ అభ్యంతరాలకు బలం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు వేలాది మందితో GRMB కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు. కేంద్రం, చంద్రబాబు(Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth Reddy) కలిసి తెలంగాణకు చేస్తున్న జల ద్రోహాన్ని అడ్డుకుంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment