ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) రాజకీయాలు రోజురోజుకూ సరికొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) సతీమణి శ్రీదేవి (Sridevi) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. చట్టం (Law) ముందు అందరూ సమానులే అంటున్నప్పటికీ, అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం.. వైసీపీ(YSRCP) శ్రేనులకు మరో న్యాయమా అంటూ ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబంపై (Family) జరుగుతున్న పరిణామాలపై ఆయన భార్య(Wife) శ్రీదేవి (Sridevi) తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు(Chandrababu), కూటమి నేతల (Alliance Leaders) తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపులో భాగంగా హత్య కేసుగా మార్చేశారని ఆమె ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ… “మా కుటుంబం రోడ్డు ప్రమాదం కేసు గురించి పదేపదే చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు మాట్లాడుతున్నారు. మరి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు(Mamidi Govindarao) కుమారుడు సాయి గణేష్ (Sai Ganesh) కారు ప్రమాదం (Car Accident) అంశంపై చంద్రబాబు (Chandrababu) ఎందుకు మాట్లాడటం లేదు?” అంటూ సూటిగా ప్రశ్నించారు.
భోగయ్య మృతి కేసులో ఎందుకు మౌనం?
2024లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భోగయ్య(Bhogayya) అనే వ్యక్తి మృతి చెందారని శ్రీదేవి గుర్తుచేశారు. ఆ కారు నడిపింది స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడేనని బాధిత కుటుంబం బలంగా చెబుతోందని తెలిపారు. మాజీ మంత్రి కుటుంబంపై ఒక రకమైన సెక్షన్లు, అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబంపై మరో రకమైన వైఖరి అవలంబిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
“మీ పార్టీ వాళ్లయితే ఒక సెక్షన్లు.. మేమైతే మరో సెక్షన్లు వర్తిస్తాయా?” అంటూ ఆమె ప్రశ్నించారు. ఒకే రాష్ట్రం.. ఒకే చట్టం ఉన్నప్పుడు అందరికీ ఒకేలా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. భోగయ్య కుటుంబానికి కూడా తక్షణమే న్యాయం చేయాలని కోరారు.
రాజకీయంగా తమతో విభేదాలు ఉంటే నేరుగా ఎదుర్కొవాలి కానీ, కుటుంబ సభ్యులను, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టడం తగదని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పదేపదే నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన భర్త సీదిరి అప్పలరాజు రాజకీయాలకు అతీతంగా నిజాయితీగా వైద్య వృత్తి చేశారని, ఎంతోమంది ప్రాణాలను కాపాడారని గుర్తుచేశారు. మొన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి తొక్కిసలాట ఘటనలోనూ సీదిరి అప్పలరాజు అక్కడికక్కడే సీపీఆర్ చేసి ముగ్గురి ప్రాణాలను కాపాడారని తెలిపారు. అటువంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
న్యాయస్థానంలో విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ, టీడీపీ(TDP) నేతలు కావాలనే తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. సీదిరి అప్పలరాజు కేసులో ఏ సెక్షన్లైతే ఉపయోగించారో, ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడి ప్రమాద ఘటనలోనూ అవే సెక్షన్లు వర్తింపజేసి చట్టపరమైన సమాన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.








