సీఎం రేవంత్ తీరుపై డీఎంకే ఎంపీ విమ‌ర్శ‌లు.. ఆస‌క్తిక‌ర‌ ట్వీట్‌

సీఎం రేవంత్ తీరుపై డీఎంకే ఎంపీ విమ‌ర్శ‌లు.. ఆస‌క్తిక‌ర‌ ట్వీట్‌

Summarize with AI

డీలిమిటేషన్‌ (Delimitation) ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) అనుసరిస్తున్న వైఖరిని డీఎంకే ఎంపీ(DMK MP) దయానిధి మారన్‌ (Dayanidhi Maran) తీవ్రంగా ప్రశ్నించారు. తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) డీలిమిటేషన్‌ వల్ల తెలంగాణకు ప్రాతినిధ్యం పెరుగుతుందని చెబుతుండగా.. తమిళనాడులో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీకి డీలిమిటేషన్‌పై స్పష్టమైన, ఏకరీతి విధానం లేదని విమర్శించారు.

తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు (Lok Sabha Seats) పెరిగే అవకాశం ఉందంటూ సీఎం రేవంత్‌ రెడ్డి డీలిమిటేషన్‌ ప్రక్రియకు అనుకూలంగా మాట్లాడుతున్నారని దయానిధి మారన్‌ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో రేవంత్‌ రెడ్డి డీలిమిటేషన్‌ను బహిరంగంగా సమర్థిస్తున్నప్పుడు.. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని మారన్‌ ప్రశ్నించారు.

తమిళనాడులో డీలిమిటేషన్‌ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు, సమావేశాలు నిర్వహించడాన్ని దయానిధి మారన్‌ తప్పుబట్టారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో మాత్రమే కాంగ్రెస్‌ ‘నో డీలిమిటేషన్‌’ వైఖరి తీసుకోవడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.

తమిళనాడులో ఎంపీలతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సమావేశాలను ఎందుకు నిర్వహించలేదని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అవలంబించాల్సిన కాంగ్రెస్‌.. రాష్ట్రాన్ని బట్టి భిన్నమైన వైఖరులు ఎందుకు ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు.

డీలిమిటేషన్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తొలుత ‘ఫెయిర్‌ డీలిమిటేషన్‌’(Fair Delimitation) గురించి మాట్లాడి, ఇప్పుడు తమిళనాడులో మాత్రం ‘నో డీలిమిటేషన్‌’ (No Delimitation) అంటోందా? అని దయానిధి మారన్‌ (Dayanidhi Maran) ప్రశ్నించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని ప్రకటించే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని నిలదీశారు.

తమిళనాడులో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆందోళనలు చేస్తూనే.. అదే పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి డీలిమిటేషన్‌ వల్ల రాష్ట్రానికి ప్రాతినిధ్యం పెరుగుతుందని చెబుతున్నారని మారన్‌ పేర్కొన్నారు. ఈ రెండు వైఖరులపై కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment