కన్నడ నటుడు దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు!

కన్నడ నటుడు దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు!

Summarize with AI

కన్నడ అగ్ర హీరో (Kannada Star Hero) దర్శన్ (Darshan ప్రధాన నిందితుడిగా ఉన్న సంచలనాత్మక రేణుకాస్వామి హత్య కేసులో (Renukaswamy Murder Case) ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టై కటకటాల వెనుక ఉన్న నిందితులలో ఒకరైన దర్శన్ అనుచరుడు ప్రదోష్(Pradosh) (A-14 నిందితుడు) ఈ కేసులో అప్రూవర్‌గా (Approver) మారేందుకు కోర్టులో పిటిషన్ (Petition) దాఖలు చేశారు. ఈ సందర్భంగా హత్య జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందనే దానిపై ఆయన కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో పూసగుచ్చినట్లు వివరిస్తూ పలు భయానక నిజాలను బయటపెట్టారు.

తమ ప్రియురాలు పవిత్ర గౌడకు (Pavithra Gowda) అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడన్న కక్షతో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన తర్వాత, హీరో దర్శన్ విచక్షణారహితంగా దాడి చేశాడని ప్రదోష్ తెలిపారు. దర్శన్ పిలవడంతో అక్కడికి వచ్చిన పవిత్ర గౌడ కూడా రేణుకాస్వామిని చెప్పుతో కొట్టిందని పేర్కొన్నారు.

రేణుకాస్వామి తల నుంచి రక్తం కారేలా తీవ్రంగా కొట్టారని, లోదుస్తులతోనే ఒక వాహనానికి (టాటా ఏస్) వేలాడదీసి నైలాన్ తాడుతో (Nylon Rope) దాడి చేశారని వాంగ్మూలంలో వెల్లడించారు. అంతేకాకుండా, దర్శన్ తన కాళ్లతో రేణుకాస్వామి ఛాతీ, మెడపై బలంగా తన్నాడని, దీంతో అతను స్పృహ కోల్పోయాడని తెలిపారు.

రేణుకాస్వామి (Renukaswamy) ఛాతీపై నిలబడి తొక్కేందుకు దర్శన్ ప్రయత్నించగా, తాను అడ్డుకుని పక్కకు లాగానని, అయితే అప్పటికే రేణుకాస్వామి మృతి చెందాడని ప్రదోష్ సంచలన నిజం బయటపెట్టారు. హత్య జరిగిన తర్వాత ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు, బయటకు పొక్కకుండా ఉండేందుకు కొన్ని వర్గాల ద్వారా సెటిల్మెంట్‌లకు తెరలేపారని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, సాక్ష్యాలను తారుమారు చేసిన తీరును తాను కోర్టుకు వివరిస్తానని ప్రదోష్ పేర్కొన్నారు.

ఈ కేసులో సహ నిందితుడే స్వయంగా అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇవ్వడం, అందులోనూ హీరో దర్శన్ (Darshan) క్రూరమైన చర్యలను పూసగుచ్చినట్లు వివరించడం కన్నడ సినీ వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment