చిలీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనలు

చిలీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనలు

ద‌క్షిణ అమెరికాలోని చిలీలో ఆంటోఫగాస్టా వ‌ద్ద భారీ భూకంపం సంభవించింది. ఇది 6.2 తీవ్రతతో ప్రకంపనలు సృష్టించింది. భూకంపం కేంద్రం 104 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్ (EMS) ప్రకటించింది. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం ఎలా ఉన్నదో ఇంకా సమాచారం అందలేదు. అయితే, సీసీ కెమెరాలు రికార్డ్ చేసిన భూకంప దృశ్యాలు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా వైర‌ల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో భవనాలు కొద్ది సేపు అటు ఇటు ఊగుతున్న దృశ్యాలు కనిపించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment