టీడీపీ నేర్పిన‌ “సంస్కారం” ఇదేనా?

టీడీపీ నేర్పిన‌ "సంస్కారం" ఇదేనా?

Summarize with AI

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయ వేడి ఒక్క‌సారిగా ప‌రాకాష్ట‌కు చేరింది. వైసీపీ నేత‌ల‌పై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అత్యంత హేయ‌మైన‌, వివాదాస్పద వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర క‌లకలం రేపుతోంది. మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్, సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకున్న వ్యాఖ్యలు ఉన్నాయంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సంస్కారం గురించి నీతులు చెప్పే టీడీపీ.. బూతులు మాట్లాడ‌డంలో శిక్ష‌ణ ఇచ్చిందా అంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

వైసీపీకి చెందిన మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత దేవినేని అవినాష్‌లను లక్ష్యంగా చేసుకుని బోండా ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాడు, వీడు అంటూ దుర్భాష‌లాడారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లిని “పకోడీగాడు” అంటూ వ్యాఖ్యానిస్తూ, “ఎక్కడో సీటు తీసేసి ఇక్కడికి వస్తే 70 వేల ఓట్ల తేడాతో ఓడించా. కొబ్బరి చిప్పలు కొట్టేసిన అవినీతిపరుడు” అని రెచ్చిపోయి తీవ్రంగా దూషించారు.

“అవినాష్ తినేదే రక్తపు కూడు. రౌడీలను, కిరాయి రౌడీలను పెట్టుకుని బతికే వ్యక్తి” అని ఆరోపించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణును ఉద్దేశించి, “బ్రాహ్మణుడు ఎవడైనా మద్యం వ్యాపారం చేస్తాడా? వీడికి బీసెంట్ రోడ్డులో మొదట ఉన్నది సారా కొట్టే” అని వ్యాఖ్యానించారు.

పేర్ని నానిపై నేరుగా టార్గెట్‌ చేస్తూ.. “కిందా పైనా పగలకొట్టగలడు బోండా ఉమా గుర్తుపెట్టుకో.. కిందా పైనా మళ్లీ నోట్ చేసుకో .. బందర్ వచ్చి, నీ ఇంటికి వచ్చి, నీ బతుకేందిరా పేర్ని నాని .. ఏందిరా నీ బతుకు? నువ్వు దొంగ బియ్యం కొట్టేసి, భార్య పేరు మీద వేర్ హౌస్ పెట్టుకొని, బియ్యాన్ని అమ్మేసుకుని నీ బతుకు కుక్క బతుకు. నువ్వు నా గురించి మాట్లాడతావా” అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనూ, బయటా నాయకులు మాట్లాడే భాషపై, గౌరవ మర్యాదలపై నిత్యం నీతులు చెప్పిన తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇటువంటి నీచమైన భాషను ప్రోత్సహిస్తున్నారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. “గత ప్రభుత్వంలో నాయకులు బూతులు మాట్లాడారని ఆరోపణలు చేసిన టీడీపీ పెద్దలు, ఇప్పుడు తమ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన బాడీ షేమింగ్, బూతు వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారు?” అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment