వందేమాతరం బిల్లు ఆమోదం.. గేయాన్ని అవ‌మానిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

వందేమాతరం బిల్లు ఆమోదం.. గేయాన్ని అవ‌మానిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

Summarize with AI

జాతీయ గీతం ‘జనగణమన’కు (Jana Gana Mana) ఉన్నట్లే జాతీయ గేయం ‘వందే మాతరం’(Vande Mataram)నకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించే జాతీయ గౌరవ అవమాన నిరోధక (సవరణ) చట్టం–2026కు (Amendment) Act, 2026) రాష్ట్రపతి (President) ఆమోదం లభించింది. దీంతో ఇకపై ‘వందే మాతరం’ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది.

ఈ సవరణతో 1971 నాటి జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం పరిధిని విస్తరించి, ఇప్పటివరకు జాతీయ గీతానికి మాత్రమే ఉన్న చట్టబద్ధ రక్షణను జాతీయ గేయమైన ‘వందే మాతరం’కు (Vande Mataram) కూడా వర్తింపజేశారు. దీంతో ‘జనగణమన’తో(Jana Gana Mana) సమానంగా ‘వందే మాతరం’నకు కూడా చట్టపరమైన రక్షణ లభించింది.

ఈ చట్టం ప్రకారం ‘వందే మాతరం’ (Vande Mataram)ఆలాపనను కావాలనే అడ్డుకోవడం లేదా ఆలాపన జరుగుతున్న సభకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడం నేరంగా పరిగణిస్తారు. అలాంటి చర్యలకు గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

ఈ సవరణతో దేశ జాతీయ చిహ్నాల పట్ల గౌరవాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన రక్షణను విస్తరించినట్లు పేర్కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment