సీఎం ఒమర్ అబ్దుల్లా దంపతులకు సుప్రీంకోర్టు విడాకులు!

17 ఏళ్ల ఎడబాటుకు ఎండ్.. సీఎం ఒమర్ అబ్దుల్లా దంపతులకు సుప్రీంకోర్టు విడాకులు!

Summarize with AI

జమ్మూ కాశ్మీర్(Jammu & Kashmir) ముఖ్యమంత్రి(Chief Minister) ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah), ఆయన భార్య పాయల్ అబ్దుల్లా(Payal Abdullah) దాంపత్య బంధానికి ఎట్టకేలకు అధికారికంగా ముగింపు లభించింది. దాదాపు 17 ఏళ్లుగా విడిగా జీవిస్తున్న ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోగా, వారి అభ్యర్థనకు సుప్రీంకోర్టు(Supreme Court) ఆమోదం తెలిపింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ (P. S. Narasimha), జస్టిస్ అలోక్ అరధే (Alok Aradhe)ధర్మాసనం ఈ కేసును విచారించింది.

ఇరు పక్షాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(Kapil Sibal), ఒమర్ అబ్దుల్లా–పాయల్ (Omar Abdullah-Payal Abdullah) తమ మధ్య ఉన్న అన్ని విభేదాలను పరిష్కరించుకుని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద వివాహ బంధాన్ని రద్దు చేయాలని సంయుక్తంగా కోరినట్లు కోర్టుకు వివరించారు. అలాగే ఒకరిపై ఒకరు దాఖలు చేసుకున్న అన్ని న్యాయపరమైన కేసులను కూడా ఉపసంహరించుకోవడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

ఒమర్ అబ్దుల్లా, పాయల్ 1994లో వివాహం చేసుకోగా, వీరికి జహీర్(Zamir), జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2009 నుంచే ఇద్దరూ విడిగా నివసించడం ప్రారంభించగా, 2011లో తమ దాంపత్య జీవితం ముగిసిందని ఒమర్ అబ్దుల్లా బహిరంగంగా ప్రకటించారు. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన ఆయన పిటిషన్ 2016లో తిరస్కరణకు గురైంది.

అనంతరం ఢిల్లీ హైకోర్టును (Delhi High Court)ఆశ్రయించినప్పటికీ, 2023లో హైకోర్టు కూడా అదే తీర్పును సమర్థిస్తూ పాయల్‌కు నెలకు రూ.1.5 లక్షల భరణం, కుమారుడి విద్య కోసం అదనంగా నెలకు రూ.60 వేల చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో(Supreme Court) సవాలు చేసిన ఒమర్ అబ్దుల్లా కేసు మధ్యవర్తిత్వానికి వెళ్లగా, అక్కడ ఇరు పక్షాలు పరస్పర అవగాహనకు వచ్చి అన్ని వివాదాలకు ముగింపు పలికాయి.

దీంతో సుప్రీంకోర్టు వారి విడాకులకు అధికారికంగా ఆమోదం తెలుపుతూ దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి తెరదించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment