కెనడాలో రూ.930 కోట్ల డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

కెనడాలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.930 కోట్ల డ్రగ్స్ సీజ్..

Summarize with AI

కెనడాలోని (Canada) ఒంటారియోలో (Ontario) భారీ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్‌ను (International Drugs Smuggling Racket) పోలీసులు(Police)ఛేదించారు. దాదాపు రూ.930 కోట్ల విలువైన 1.7 టన్నుల మాదకద్రవ్యాలను (Narcotics) స్వాధీనం చేసుకుని, ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో అత్యధికులు భారతీయ (Indian) సంతతికి చెందినవారే కావడం సంచలనంగా మారింది.

మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికా–కెనడా సరిహద్దు (United States–Canada Border) మార్గంగా భారీ స్థాయిలో డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించిన అధికారులు, ‘ప్రాజెక్ట్ బే’ పేరుతో 2025 జనవరి నుంచి దర్యాప్తు చేపట్టి ఈ భారీ నెట్‌వర్క్‌ను భగ్నం చేసినట్లు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, అరెస్టైన వారిలో ఎక్కువ మంది ట్రక్కు డ్రైవర్లే (Truck Drivers) ఉండడం గమనార్హం. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల్లో 973 కిలోల కొకైన్, 660 కిలోల మెథాంఫెటమైన్, 49 కిలోల నల్లమందు, 230 కిలోల ఆక్సీకొడోన్ టాబ్లెట్లు ఉన్నాయి.

అంతేకాకుండా 17 తుపాకులు(Firearms), 80 వేల కెనడియన్ డాలర్లు(Canadian Dollars), 10 వేల అమెరికన్ డాలర్లు (US Dollars), ఖరీదైన నగలు, 43 సెల్‌ఫోన్లు(Mobile Phones), ఆరు ల్యాప్‌టాప్‌లు(Laptops), ఒక వాహనం కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ కెనడా చరిత్రలో అతిపెద్ద డ్రగ్స్ స్వాధీనం కేసుల్లో ఒకటిగా నిలవగా, అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలపై దర్యాప్తును మరింత విస్తరించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment