మ్యూజిక్ లవర్స్‌కు ఫుల్ ఫీస్ట్.. ‘శ్రీ శ్రీ’ తొలి పాట

మ్యూజిక్ లవర్స్‌కు ఫుల్ ఫీస్ట్.. ‘శ్రీ శ్రీ’ తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ విడుదల!

Summarize with AI

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) తొలిసారి జంటగా నటిస్తున్న పాన్-ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’(Sri Sri) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రవి నెలకుదిటి (Ravi Nelakuditi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ (SLV) సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సంస్థకు ఇది 10వ చిత్రం కాగా.. ఇషాన్ సక్సేనా (Ishan Saxena) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, వర్కింగ్ స్టిల్స్‌కు మంచి స్పందన లభించగా.. తాజాగా చిత్రబృందం మొదటి పాటగా ‘బొమ్మ బొమ్మ’ను (Bomma Bomma) విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

‘బొమ్మ బొమ్మ’(Bomma Bomma) పాట ప్రేమలోని (Love) తొలి అనుభూతిని ఎంతో అందంగా తెరపై ఆవిష్కరించింది. రైల్వే స్టేషన్‌లో ఓ బెంచ్‌పై కూర్చున్న దుల్కర్ సల్మాన్, ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన పూజా హెగ్డేను తొలిసారి చూసిన క్షణంలోనే ఆమె ప్రేమలో పడే సన్నివేశాలతో పాట ప్రారంభమవుతుంది. ఈ మెలోడీకి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) తనదైన శైలిలో హృదయాన్ని హత్తుకునే స్వరాలను అందించారు.

సింపుల్ అయినా ఆకట్టుకునే ట్యూన్‌కు క్లాసీ ఆర్కెస్ట్రేషన్ జోడించి పాటను మరింత స్పెషల్ గా మార్చారు. అనంత ఈ పాటకు శ్రీరామ్ (Sriram) తన సాహిత్యం అందించగా.. గాయకుడు కపిల్ కపిలన్ (Kapil Kapilan) తన మృదువైన గాత్రంతో పాటకు మరింత ప్రాణం పోశారు. రామ్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రతి సన్నివేశాన్ని అందంగా తెరకెక్కించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment