సుచిర్‌ బాలాజీ ఆత్మహత్య.. స్పందించిన ఎలన్ మ‌స్క్‌

సుచిర్‌ బాలాజీ ఆత్మహత్య.. స్పందించిన ఎలన్ మ‌స్క్‌

Summarize with AI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) ఆత్మ‌హ‌త్య చేసుకొని మరణించాడు. అతని మృతితో టెక్ ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే, మరణంపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. బాలాజీ తల్లి పూర్ణిమారావు తన కుమారుడు ఆత్మహత్యను న‌మ్మ‌లేక‌పోతున్నారు. త‌న కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాడంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

మృతదేహంపై మరోసారి శవపరీక్ష నిర్వహించిన తరువాత “బాలాజీ తలకు గాయాలు, అపార్ట్‌మెంట్‌లో రక్తపు మరకలు కనిపించాయి. అతని ప్రాణాలు పోయినట్టు చూపించే ఆనవాళ్లు లభించాయి” ఈ అభిప్రాయం మేరకు, ఏదైనా హత్య జరిగిందని అత‌ని త‌ల్లి భావిస్తున్నారు. ఆమె చేసిన పోస్ట్‌ను ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి మరియు భారత విదేశాంగ శాఖను ట్యాగ్ చేశారు. ఎలాన్ మస్క్ ఈ విషయం మీద స్పందిస్తూ “అది ఆత్మహత్యలా అనిపించడం లేదు” అని చెప్పారు.

ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా బాలాజీ ఆందోళన
బాలాజీ, నాలుగేళ్లు ఓపెన్ ఏఐలో పరిశోధకుడిగా పనిచేసిన తరువాత, 2023లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. చాట్‌జీపీటీని వ్యతిరేకిస్తూ అదొక హానికరమైన సాంకేతికత అని, అది కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తుందంటూ విమర్శలు చేశారు. అతని మరణం ఆసక్తికరమైన అనుమానాలను కలిగిస్తోంది. బాలాజీ తండ్రి రామమూర్తి, తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నారు. తన కుమారుడి మరణంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరపాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment