‘కాక్రోచ్’ ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

Summarize with AI

నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనకు క్రమక్రమంగా దేశ వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. బాలీవుడ్ నటి ప్రీతి జింటా మరోసారి సామాజిక అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్యా సంస్కరణల కోసం కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలపై స్పందించిన ఆమె, వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు.

శాంతియుతంగా సాగుతున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొంటూనే, ఈ నిరసనలను ఎలాంటి రాజకీయ లేదా ఇతర అనుమానాస్పద శక్తులు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న విభజనాత్మక ప్రచారం ఆందోళన కలిగిస్తోందని, విద్యార్థుల అసలు లక్ష్యం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడమేనని ఆమె స్పష్టం చేశారు.

ప్రీతి జింటా తన సోషల్ మీడియా పోస్టులో ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కారానికి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఉద్యమానికి కూడా మద్దతు తెలిపిన ఆమె, ఇప్పుడు చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆమె అభిప్రాయాలను స్వాగతిస్తుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలన్న ఆమె సూచనకు విస్తృతంగా మద్దతు లభిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment