కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay)నటించిన ‘జననాయగన్'(Jana Nayagan)’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్ (Advance Booking Trends) ట్రెండ్స్ మాత్రం అభిమానులు, ట్రేడ్ వర్గాలను కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు నమోదైన బుకింగ్స్‌ను పరిశీలిస్తే, ఈ చిత్రం రజనీకాంత్(Rajinikanth) ‘కూలీ’ (Coolie) లేదా విజయ్(Vijay) గత చిత్రం ‘లియో’ (Leo) సాధించిన రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ను అందుకునే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను అయినా ఈ సినిమా సాధిస్తుందా అనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
విజయ్ గత చిత్రాలతో పోలిస్తే ఈసారి అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో ఆశించిన స్థాయి జోరు కనిపించడం లేదు. దీనికి సినిమా పలుమార్లు వాయిదా పడటం, విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ కావడం వంటి పరిణామాలు ప్రీ-రిలీజ్ హైప్‌పై (Pre-Release Hype) ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ విజయ్‌కు ఉన్న భారీ మాస్ ఫాలోయింగ్, స్టార్డమ్ కారణంగా ‘జననాయగన్’ కోలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాన్ని ట్రేడ్ వర్గాలు కొట్టిపారేయడం లేదు.








