విద్యుత్ తీగలపై నాట్యం.. మద్యం మత్తులో వింత విన్యాసం

విద్యుత్ తీగలపై నాట్యం.. మద్యం మత్తులో వింత విన్యాసం

మ‌ద్యం మ‌త్తులో ఓ వ్య‌క్తి చేసిన హంగామా అంతాఇంతా కాదు. త‌ప్ప‌తాగి విద్యుత్ తీగ‌ల‌పై విన్యాసాలు చేశాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళ‌న‌కు గురిచేసింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కరెంటు స్తంభంపైకి ఎక్కడం ప్రారంభించాడు. అతని ఆగడాలను గమనించిన గ్రామస్థులు వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపి ప్రమాదాన్ని నివారించారు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన ఆ తాగుబోతు.. విద్యుత్ తీగలపైకి ఎక్కి అక్కడే విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ దృశ్యం చూసిన గ్రామస్థులు ఆందోళన చెందారు. చివరికి అతడిని కిందికి దింపగ‌లిగారు. ఈ సంఘటన మద్యం మత్తు ఏ మేరకు ప్రమాదకరమో మరోసారి చాటిచెప్పింది.

Join WhatsApp

Join Now

Leave a Comment