టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లో ఎన్నో గ్లామరస్ పాత్రలు పోషించినప్పటికీ, ఆన్‌స్క్రీన్‌లో మాత్రం ఎప్పుడూ బికినీ ధరించలేదు. స్టార్ హీరోల సరసన వరుస విజయాలతో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్, ప్రత్యేక గీతాల్లోనూ సందడి చేసింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు బికినీ ధరించడం ఎప్పుడూ కంఫర్టబుల్‌గా అనిపించలేదని వెల్లడించింది. కెరీర్ ప్రారంభం నుంచి ఎంత పెద్ద సినిమా అవకాశం వచ్చినా, బికినీ సన్నివేశం ఉంటే ఆ చిత్రాన్ని అంగీకరించేదాన్ని కాదని, తన వ్యక్తిగత అభిరుచులకు, సౌకర్యానికి విరుద్ధంగా ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం వివాహం అనంతరం కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇస్తూనే కాజల్ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఒక బాబుకు తల్లైన ఆమె, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది.
గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, మహిళా ప్రధాన కథలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే దిశగా అడుగులు వేస్తోంది. వ్యక్తిగత విలువలను కాపాడుకుంటూనే కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కాజల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.








