అణ‌చివేస్తే ప్ర‌శ్నించే గొంతులు ఆగుతాయా..?

అణ‌చివేస్తే ప్ర‌శ్నించే గొంతులు ఆగుతాయా..?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) సోషల్ మీడియా (Social Media) నియంత్రణ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా కార్యకలాపాలపై డీజీపీ(DGP) ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారం, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికార వర్గాలు చెబుతుండగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నమే జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.

ఇప్ప‌టికే 90 శాతం మీడియా, 80 శాతం సోష‌ల్ మీడియాను ఆక్యుపై చేసిన టీడీపీ(TDP).. మిగిలిన 20 శాతం కూడా ప్ర‌శ్నించే గొంతుక‌లు (Questioning Voices) ఉండ‌కూడ‌దు అనేది ప్ర‌భుత్వ ఉద్దేశంగా క‌నిపిస్తోంది. అయితే, అణ‌చివేస్తున్నా కొద్దీ.. ప్ర‌శ్నించే గొంతులు రెట్టింపు అవుతాయన్న లాజిక్ ను ప్రభుత్వానికి తట్టలేదా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక వేదికగా మారింది. ప్రధాన మీడియా సంస్థల్లో ఎక్కువ భాగం ప్రభుత్వానికి (Government) అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షం, కార్యకర్తలు, పౌరులు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్ర‌భుత్వం దీనికి దుష్ప్ర‌చారం అరిక‌ట్టేందుకు అని పైకి పేరుపెట్టినా, ‘విమర్శల అణచివేతే అసలు ఉద్దేశం’ అని వైసీపీ(YSRCP) క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా చెబుతోంది.

సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, తప్పుడు ప్రచారం, మార్ఫింగ్ వీడియోలు(Morphed Videos), ఫేక్ న్యూస్‌ను (Fake News) అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, అవి ఎక్కువ‌గా అధికార పార్టీకి చెందిన వ్య‌క్తుల నుంచే పోస్టు అవుతున్నాయ‌ని తాజా ఉదాహ‌ర‌ణ‌లే చెబుతున్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి భార్య (Former Chief Minister Wife) గురించి రెండ్రోజులుగా నెట్టింట తిరుగుతున్న వీడియోనే అందుకు స‌జీవ సాక్ష్యం అంటున్నారు నెటిజ‌న్లు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజలు, యువత, ప్రతిపక్ష కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం ద్వారా విమర్శలను అణచివేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.

కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించిన తెలుగుదేశం పార్టీ(TDP), అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వేదికపై కఠిన చర్యలకు దిగుతోందని ఆ పార్టీ విమర్శిస్తోంది.

సోషల్ మీడియాలో అబద్ధాలు, మార్ఫింగ్‌లు, దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి గతంలో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఖాతాలను టీడీపీ(TDP) ప్రోత్సహించింద‌నే ఆరోపణలను వైసీపీ(YSRCP) ప్రస్తావించింది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై అనుకూల సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా వ్యక్తిగత దాడులు చేయించడం టీడీపీ(TDP) విధానమని ఆరోపించింది. అదే సోషల్ మీడియా వ్యవస్థలో పనిచేసిన కొందరికి ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, సలహాదారు పదవులు, మీడియా సంబంధిత బాధ్యతలు ఇచ్చారనే వైసీపీ ఆధారాలు చూపుతోంది. చంద్ర‌బాబు ప్రభుత్వాన్ని(Chandrababu Government) ప్రశ్నించిన యువకులపై కేసులు నమోదు చేస్తూ, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసిన వారికి పదవులు ఇవ్వడం సమాన న్యాయమా అని ప్రశ్నిస్తోంది.

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్'(Super Six), ‘సూపర్ సెవెన్'(Super Seven) హామీల అమలు, ఆడబిడ్డ నిధి(Aadabidda Nidhi), నిరుద్యోగ భృతి(Unemployment Allowance), కొత్త పెన్షన్లు(New Pensions), గృహాల (Housing Schemes) వంటి సంక్షేమ అంశాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో, సోషల్ మీడియాపై మంత్రివర్గ స్థాయిలో విస్తృత చర్చ జరగడం పట్ల కూడా వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

సోషల్ మీడియా నియంత్రణ చర్యలు ప్రజా ప్రయోజనాల కోసమా, లేక రాజకీయ విమర్శలను నియంత్రించే దిశగానా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ప్ర‌భుత్వం ప్ర‌శ్నించే పౌరుల గొంతును అణ‌చివేయాల‌ని చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై 24 గంట‌ల్లోనే పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు, ఆక్షేప‌ణ‌లు వ‌స్తున్న త‌రుణంలో ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గే ఆలోచ‌న ఏమైనా చేస్తుందా.. లేక ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా అడుగులు వేస్తుందా అని వేచిచూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment