ఇటీవల కాలం వరకు తెనాలి టూ టౌన్ సీఐగా విధులు నిర్వహించి, గత నెలలో వీఆర్‌కు (Vacancy Reserve) బదిలీ అయిన సీఐ రాములు నాయక్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆయనపై ఒంగోలుకు చెందిన ఓ మహిళ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. కాగా, శాఖాపరమైన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. సీఐ రాములు నాయక్‌కు సంబంధించిన రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాధిత మహిళ కథనం ప్రకారం.. గతంలో ఒంగోలులో రాములు నాయక్ ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో, భర్తతో విభేదాల కారణంగా ఆమె పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఆ సమయంలో కంప్లయింట్ కాపీ నుంచి ఫోన్ నంబర్ తీసుకొని పరిచయం పెంచుకున్న రాములు నాయక్, ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆ తరువాత మహిళ ఒత్తిడితో శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారని సదరు మహిళ బహిరంగంగా పేర్కొన్నారు.
కొంతకాలం సజావుగానే సాగినప్పటికీ, తెనాలికి సీఐగా బదిలీ అయిన తర్వాత ఆయన మరో మహిళతో సంబంధం పెట్టుకుని తన్ను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై తాను ప్రశ్నించినందుకు గాను రాములు నాయక్ తనను శారీరకంగా, మానసికంగా వేధించారని, తెనాలిలోని ఆయన నివాసంలో తనపై దాడి కూడా జరిగిందని ఆమె ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఆడియోలు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.
వ్యక్తిగత ఆరోపణలతో పాటు, సీఐగా ఉన్న సమయంలో రాములు నాయక్ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెనాలి పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లు, స్థానిక వ్యాపారుల నుండి నెలవారీ మామూళ్లు వసూలు చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి.
ఒక ప్రముఖ వ్యాపారి నుండి అప్పుల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేయడానికి ప్రయత్నించగా, సదరు వ్యాపారి నిరాకరిస్తూ మాట్లాడిన ఫోన్ ఆడియో రికార్డు గతంలో జిల్లా ఎస్పీకి చేరింది. ఈ ఆడియో ఆధారంగానే ప్రాథమిక చర్యగా ఆయనను గత నెలలో వీఆర్‌కు పంపినట్లు సమాచారం.
గతంలో గంజాయి కేసులో పట్టుబడిన కొందరు యువకుల పట్ల నడిరోడ్డుపై చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించారనే విమర్శలు కూడా రాములు నాయక్‌పై ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాసలీలలు, అక్రమ వసూళ్ల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపే బాధ్యతను తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావుకు అప్పగించారు. అయితే, ఒకే సబ్ డివిజన్‌కు చెందిన అధికారికి ఈ విచారణ అప్పగించడంపై స్థానికంగా, పోలీస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పూర్తిస్థాయి నివేదిక వచ్చిన అనంతరం ఉన్నతాధికారులు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.








