యూట్యూబ్ స్టార్స్ సిద్ధూ–సోనియా పెళ్లికి ముహూర్తం ఫిక్స్..

యూట్యూబ్ స్టార్స్ సిద్ధూ–సోనియా పెళ్లికి ముహూర్తం ఫిక్స్..

యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీ జంట సిద్ధూ పవన్ (Siddu Pawan) – సోనియా సింగ్ (Sonia Singh) త్వరలో పెళ్లి (Wedding) పీటలు ఎక్కబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులను ఎప్పటి నుంచో వెంటాడుతుండగా, తాజాగా సోనియా స్వయంగా శుభవార్త చెప్పేశారు. బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో కలిసి సందడి చేస్తూ, తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ జంటకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సోనియా అమాయకంగా చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తరచూ వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న సోనియాను హోస్ట్ పెళ్లి గురించి ప్రశ్నించగా, తొలుత సరదాగా స్పందిస్తూ.. “ఏమో.. పెళ్లయిపోయిందేమో.. నేను చెప్పట్లేదేమో” అంటూ నవ్వులు పూయించింది. అనంతరం అసలు విషయాన్ని వెల్లడిస్తూ, “సెప్టెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 1:45 గంటలకు మా పెళ్లి జరగనుంది” అని ప్రకటించింది.

యూట్యూబ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన సోనియా సింగ్, తర్వాత షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘విరూపాక్ష’ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రతో ఆకట్టుకున్న ఆమె, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'(Extra Ordinary Man) లో కామెడీ పాత్రలో నవ్వులు పంచారు. ఇటీవల విడుదలైన ‘నాగబంధం'(Nagabandham) సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్న సిద్ధూ పవన్–సోనియా సింగ్ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment