చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో భారీ అప్పు

చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో భారీ అప్పు

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Alliance Government) అప్పుల(Loans) వేటను నిర్విరామంగా కొనసాగిస్తోంది. ప్రతి మంగళవారం ఆర్‌బీఐ(RBI) ద్వారా కొత్త అప్పులు తీసుకువ‌స్తుంది. తాజాగా ఈ మంగళవారం కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ సెక్యూరిటీల (Government Securities) వేలం (Auction) ద్వారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రభుత్వం మరో రూ.2,600 కోట్ల అప్పును తీసుకువ‌చ్చింది. ఈ తాజా రుణంతో రాష్ట్రంలో అప్పుల లెక్కలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) అధికారంలోకి వచ్చిన ఈ 25 నెలల కాలంలోనే అప్పుల పరిమాణం ఊహించని స్థాయికి చేరిందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజా రుణంతో కలిపి బాబు సర్కార్ చేసిన మొత్తం అప్పుల విలువ ఏకంగా రూ.3,55,000 కోట్లకు చేరినట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో “సంపద సృష్టిస్తాం.. అప్పులు (Loans) లేని ఏపీని చేస్తాం” అని నినదించిన పాలకులు.. ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా దేశంలోనే అప్పుల్లో సరికొత్త రికార్డుల వైపు పయనిస్తున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఈ 25 నెల‌ల కాలంలో చేసిన మొత్తం అప్పు రూ.3,55,000 కోట్లు కాగా, ఇందులో బడ్జెటరీ అప్పులు రూ.1,97,000 కోట్లు, బడ్జెట్ వెలుపలి అప్పులు రూ.1,12,504 కోట్లు, కాగా, అమరావతి (Amaravati) పేరుతో తెచ్చిన అప్పులు రూ.47,387 కోట్లు అని గ‌ణాంకాలు చెబుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment