దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక ప్రకారం, రేవంత్ వద్ద రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
ఏడీఆర్ రిపోర్టులో అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.931 కోట్లతో జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. అరుణాచల్ సీఎం పెమా ఖాండు రూ.332 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం రూ.15 లక్షల ఆస్తులతో జాబితాలో చివరి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆస్తుల జాబితా ప్రజలను ఒకింత షాక్‌కు గురిచేసింది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ సంపన్నుల సీఎంల జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు.








