సంగీత ప్రపంచంలో తనదైన ట్యూన్స్‌తో యూత్‌ను ఊపేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) … ఐపీఎల్ మ్యాచ్‌ల్లో (IPL Matches) తన హావభావాలతో కుర్రకారు గుండెల్లో మైలేజ్ పెంచేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సీఈవో(CEO) కావ్య మారన్(Kavya Maran).. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. బిజినెస్ ఉమెన్, మ్యూజిక్ డైరెక్టర్ల ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి లవ్ అండ్ మ్యారేజీ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
వీరిద్దరి ప్రేమ వ్యవహారం, పెళ్లి(Marriage) వార్తలపై గతంలో అనిరుధ్ స్పందిస్తూ.. “కేవలం రూమర్స్(Rumours) మాత్రమే.. కాస్త ప్రశాంతంగా ఉండండి” అంటూ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ గాసిప్స్‌కు తాజాగా అనిరుధ్ సొంత బాబాయ్, ప్రముఖ సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ (Y. G. Mahendran) ఇచ్చిన ఒక ఇంటర్వ్యూతో సరికొత్త జోష్ వచ్చింది.
“అనిరుధ్ చాలా మృదు స్వభావి. నాకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి (Marriage) చేసుకోబోతున్నారు. కావ్య మారన్ ఏమీ సాధారణ అమ్మాయి కాదు.. అంత పెద్ద ఐపీఎల్ టీమ్‌ను లీడ్ చేయగల బిజినెస్ మైండ్ ఆమెది. తన తండ్రి (కళానిధి మారన్) నుంచి వ్యాపార నైపుణ్యాలను పుణికిపుచ్చుకుంది. అనిరుధ్, కావ్య సూపర్ పెయిర్” అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి పెళ్లికి (Marriage) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, అందుకే బాబాయ్ అంతలా కన్ఫర్మ్ చేశారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ క్రేజీ జంట పెళ్లి ఎక్కడ జరగబోతోందనే దానిపై కూడా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సన్ గ్రూప్ (Sun Group)అధినేత కళానిధి మారన్(Kalanithi Maran) నిర్మించిన ‘జైలర్'(Jailer), ‘బీస్ట్'(Beast) వంటి భారీ చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారిందని ఇన్ సైడ్ టాక్. ఇక పెళ్లిని కూడా చాలా గ్రాండ్‌గా, ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా విదేశాల్లో (లండన్ లేదా ఇటలీలో) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ వార్తలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో కావ్య మారన్ పీఆర్ టీమ్ అలర్ట్ అయింది. అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి చేసుకుంటున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ బేస్‌లెస్ రూమర్స్ అని ఆమె సన్నిహిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అటు అనిరుధ్ కూడా రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో పెళ్లి ప్రస్తావన రాగానే.. “మళ్లీ మొదలుపెట్టారా” అన్నట్లుగా నవ్వుతూ దాటవేశారు.
ఖండనలు ఎలా ఉన్నా.. అనిరుధ్ బాబాయ్ స్వయంగా హింట్ ఇవ్వడంతో ఈ లవ్ స్టోరీ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరి ఈ రాక్‌స్టార్, ఐపీఎల్ మిస్టరీ గర్ల్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కుతారా? చూడాలి.









బీరు హెల్దీ డ్రింకా?.. ‘బీచ్ షాక్స్’ కోసం నేతల తిప్పలు