లాడ్జీలో హైప్రొఫైల్ వ్య‌భిచారం.. ముగ్గురు హీరోయిన్లు సేఫ్‌

లాడ్జీలో హైప్రొఫైల్ వ్య‌భిచారం.. ముగ్గురు హీరోయిన్లు సేఫ్‌

Summarize with AI

సినీ రంగాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న మరో హైప్రొఫైల్ వ్యభిచార ముఠా (High-Profile Prostitution Racket) గుట్టును ముంబై పోలీసులు (Mumbai Police) రట్టు చేశారు. ముంబైలోని గిర్గావ్ (Girgaon) ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ హోటల్‌పై సోషల్ సర్వీస్ బ్రాంచ్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వ్యభిచార కూపంలో చిక్కుకున్న ముగ్గురు హీరోయిన్ల‌ను (Heroines) పోలీసులు సురక్షితంగా రక్షించారు.

గిర్గావ్(Girgaon) ప్రాంతంలోని ఓ హోటల్ వేదికగా పెద్ద ఎత్తున వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు ముందస్తుగా పక్కా సమాచారం అందింది. పోలీసులు వ్యూహాత్మకంగా ఒక ‘డెకాయ్‌'(Decoy) (ఫేక్‌ కస్టమర్)ను పంపించారు. హోటల్ గదిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధారణ కావడంతో, రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం ఒక్కసారిగా హోటల్‌పై దాడి చేసి నిందితులను పట్టుకుంది.

ఈ దాడుల్లో పోలీసులు రక్షించిన ముగ్గురు హీరోయిన్‌ల‌లో ఒకరు మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కథానాయిక (లీడ్ యాక్ట్రెస్) కావడం సంచలనం సృష్టిస్తోంది. మిగిలిన ఇద్దరిలో ఒకరు బెంగాలీ ఇండస్ట్రీకి చెందిన నటి కాగా, మరొకరు బాలీవుడ్ (హిందీ) చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, చిన్న చిన్న పాత్రలలో నటించిన యువతులుగా పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాల ఆశ చూపి, వారి ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఈ కూపంలోకి నెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ వ్యభిచార ముఠాను నడిపిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వద్ద మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పరిశ్రమతో (Film Industry) ఉన్న పరిచయాలను వాడుకుంటూ నటీమణులను కస్టమర్ల వద్దకు పంపుతున్నట్లు తేలింది.

ఈ వ్యవహారంలో సదరు హోటల్ యాజమాన్యానికి, మేనేజ్‌మెంట్‌కు ఎంతవరకు సంబంధం ఉంది? వీరి ఆర్థిక లావాదేవీల వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముంబై సినీ పరిశ్రమలో ఈ అరెస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment