సమంత ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్.. క్లారిటీ ఇచ్చిన‌ డైరెక్టర్!

సమంత ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్.. క్లారిటీ ఇచ్చిన‌ డైరెక్టర్!

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ క్వీన్ సమంత అభిమానులకు అంతకన్నా పెద్ద గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షికారు చేస్తున్న ఆ క్రేజీ రూమర్ ఇప్పుడు అఫీషియల్‌గా నిజమని తేలిపోయింది. సామ్ త్వరలోనే తల్లి కాబోతోంది! అవును.. ఈ విషయాన్ని మరెవరో కాదు ‘మా ఇంటి బంగారం’ మూవీ డైరెక్టర్ నందినీ రెడ్డి స్వయంగా కన్‌ఫామ్ చేసేశారు.

సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో సమంత కాస్త డిఫరెంట్‌గా కనిపించడంతో.. మెల్లగా ప్రెగ్నెన్సీ గాసిప్స్ మొదలయ్యాయి. టీషర్ట్, జీన్స్ వేసుకుని వచ్చిన సామ్‌కు ‘బేబీ బంప్’ (Baby Bump) స్పష్టంగా కనిపిస్తోందంటూ నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. అయితే ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ నందినీ రెడ్డి తాజా ఇంటర్వ్యూలో ఒక క్రేజీ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

“సమంత జీవితంలో ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా అద్భుతమైన సమయంలో వచ్చింది. ఒకవైపు మా సినిమా ‘మా ఇంటి బంగారం’ పెద్ద సక్సెస్ కావడం, మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితంలో ఈ గుడ్ న్యూస్ రావడం ఎంతో సంతోషంగా ఉంది” అని చెప్ప‌డం విశేషం.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాది చివర్లో సమంత డెలివరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడ్ న్యూస్‌ను సామ్ కానీ, ఆమె భర్త రాజ్ నిడిమోరు కానీ ఇప్పటివరకు అధికారికంగా అనౌన్స్ చేయలేదు. బహుశా సరైన ముహూర్తం చూసుకుని ఈ స్టార్ కపుల్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తారేమో చూడాలి.

ఒకవైపు నిర్మాతగా, నటిగా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో సెన్సేషనల్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సమంత.. పర్సనల్ లైఫ్‌లోనూ ఇంతటి అద్భుతమైన ల్యాండ్‌మార్క్‌ను అందుకోవడం విశేషం. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి వెబ్ సిరీస్‌ల నుంచి ‘మా ఇంటి బంగారం’ వరకు సామ్ వెన్నంటి ఉన్న రాజ్ నిడిమోరుతో గతేడాది డిసెంబర్‌లో ఆమె పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment