అల్లు అర్జున్‌కు షాక్.. కోర్టు సమన్లు జారీ

సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్‌కు షాక్.. కోర్టు సమన్లు జారీ

Summarize with AI

హైదరాబాద్ (Hyderabad) సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు (Allu Arjun) నాంపల్లి కోర్టు (Nampally Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా అల్లు అర్జున్‌తో పాటు ఇతర నిందితులకు కోర్టు సమన్లు పంపించింది. రాబోయే సోమవారం నాడు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ‘పుష్ప 2’(Pushpa 2) ప్రీమియర్ షో (Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు. ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు.. కేసు తదుపరి విచారణను వేగవంతం చేస్తూ అల్లు అర్జున్ సహా పలువురు నిందితులకు సమన్లు (Summons) జారీ చేసింది. దీంతో స్టార్ హీరో కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment