తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నటుడు విజయ్ను కలిసిన ప్రముఖ హీరో విశాల్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లయోలా కాలేజీ రోజుల నుంచి కొనసాగుతున్న తమ స్నేహాన్ని గుర్తు చేసుకున్న విశాల్.. ఇప్పటికీ విజయ్ను ప్రేమగా ‘డార్లింగ్’ అని పిలుస్తానని వెల్లడించారు. సాధారణ హీరోగా సినీ ప్రయాణం ప్రారంభించిన విజయ్.. ఎన్నో సవాళ్లు, విమర్శలను ఎదుర్కొంటూ సూపర్‌స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యున్నత స్థాయికి చేరుకోవడం గర్వకారణమని ప్రశంసించారు.
“పదవి మారింది కానీ మీ వ్యక్తిత్వం మాత్రం మారలేదు” అంటూ విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన విశాల్.. ఈ భేటీ తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. ఎంజీఆర్, జయలలిత, స్టాలిన్ వంటి నేతలను చూసినా.. రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘డార్లింగ్’ అని పిలిచే అదృష్టం తనకే దక్కిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం విశాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది.








