తెలంగాణ-ఏపీ బ్యూటీ క్వీన్స్ ఎంపిక.. గ్రాండ్ ఫినాలేలో ఎవరు గెలిచారంటే?

తెలంగాణ-ఏపీ బ్యూటీ క్వీన్స్ ఎంపిక.. గ్రాండ్ ఫినాలేలో ఎవరు గెలిచారంటే?

Summarize with AI

మిస్ యూనివర్స్ తెలంగాణ(Miss Universe Telangana), ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే (Andhra Pradesh 2026 Grand Finale) అట్టహాసంగా ముగియగా, విజేతలు మరియు టైటిల్ హోల్డర్లు ప్రత్యేక మీడియా సమావేశంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. హైదరాబాద్‌లోని (Hyderabad) సైబర్ గార్డెన్స్‌లో (Cyber Gardens) నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల నుంచి ఎంపికైన 40 మంది ఫైనలిస్టులు (Finalists) పాల్గొని తమ ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మిస్ యూనివర్స్ ఇండియా 2025 మానికా విశ్వకర్మ(Manika Vishwakarma), ఫ్రాంచైజ్ ఆపరేషన్స్ డైరెక్టర్ అంజద్ ఖాన్(Anjad Khan), మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 కాశ్వి(Kashvi) హాజరై విజేతలను అభినందించారు. అందం మాత్రమే కాదు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, మహిళా సాధికారత వంటి విలువలకు ప్రాధాన్యతనిచ్చే వేదికగా ఈ పోటీ నిలుస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.

తెలంగాణ 2026 విజేతగా హసిత నారాయణభట్ట(Hasitha Narayanabhatta), ఫస్ట్ రన్నరప్‌గా సృష్టి కనిందే నిలవగా, ఆంధ్రప్రదేశ్ 2026 కిరీటాన్ని ఫసీహా నౌమాన్ (Fasiha Nauman) కైవసం చేసుకుంది. హిమ వర్మ(Hima Varma) ఫస్ట్ రన్నరప్‌గా, సోనాలి యాదవ్ (Sonali Yadav) సెకండ్ రన్నరప్‌గా ఎంపికయ్యారు. విజేతలు తమ విజయ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్ లక్ష్యాల గురించి వివరించడంతో పాటు యువతకు ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలే విజయానికి మార్గమని సందేశం ఇచ్చారు. మహిళా సాధికారత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలను ప్రోత్సహించే ఈ వేదిక ద్వారా జాతీయ స్థాయిలో తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించనున్నామని విజేతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment