‘ఫీఫా 2026’ – ఇండియన్‌ ఫ్యాన్స్‌కు ఇక నిద్ర కరువు

'ఫీఫా 2026' - ఇండియన్‌ ఫ్యాన్స్‌కు ఇక నిద్ర కరువు

ఉత్తర అమెరికా(North America) (యునైటెడ్ స్టేట్స్(United States), కెనడా(Canada), మెక్సికో (Mexico) ఆతిథ్యమిస్తున్న ఫీఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) భారతీయ ఫుట్‌బాల్ (Indian Football) అభిమానుల దినచర్యను పూర్తిగా మార్చేయనుంది. 2022లో జరిగిన ఖతార్ వరల్డ్ కప్ (Qatar World Cup) మ్యాచ్‌లు భారతీయులకు వీలుగా రాత్రి 8:30 లేదా 11:30 గంటలకే ముగిసేవి. కానీ ఈసారి టైమ్ జోన్ల వ్యత్యాసం కారణంగా భారతీయ కాలమానం (IST) ప్రకారం మ్యాచ్‌లు అర్ధరాత్రి, తెల్లవారుజామున జరగనున్నాయి.

భారతదేశానికి, ఉత్తర అమెరికా దేశాలకు మధ్య ఉన్న టైమ్ గ్యాప్ చాలా ఉంటుంది. యుఎస్ ఈస్టర్న్ టైమ్ (ET) భారతదేశం కంటే 9 గంటల 30 నిమిషాలు వెనుకబడి ఉంటుంది. యుఎస్ పసిఫిక్ టైమ్ (PT) 12 గంటల 30 నిమిషాలు వెనుకబడి ఉంటుంది. మెక్సికో సిటీ టైమ్ (Mexico City Time) ఇండియా కంటే 11 గంటల 30 నిమిషాలు వెనుకబడి ఉంటుంది. దీనివల్ల అక్కడ మధ్యాహ్నం లేదా సాయంత్రం ప్రారంభమయ్యే మ్యాచ్‌లు, మన దేశంలో అర్ధరాత్రి దాటిన తర్వాత లేదా తెల్లవారుజామున ప్రసారమవుతాయి.

ఈ టోర్నమెంట్‌లో అత్యధిక మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు, రాత్రి 1:30 గంటలకు, తెల్లవారుజామున 3:30 గంటలకు, తెల్లవారుజామున 4:30 గంటలకు – 6:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

టోర్నీ తొలి మ్యాచ్ (మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా) భారత కాలమానం ప్రకారం జూన్ 12న అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎదురుచూసే బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ వంటి జట్ల మ్యాచ్‌లు కూడా అర్ధరాత్రి 12:30 నుండి తెల్లవారుజామున 3:30 లేదా 6:30 గంటల స్లాట్లలోనే ఉన్నాయి. జూలై 19న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం జూలై 20 తెల్లవారుజామున 12:30 గంటలకు ప్రారంభమవుతుంది.

భారతదేశంలో, ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువతలో ఫుట్‌బాల్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ సమయాలు త‌మ‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నున్నాయి అంటున్నారు ఫుట్‌బాల్ అభిమానులు. దీనివల్ల ఐటీ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు మరుసటి రోజు విధులకు హాజరుకావడం పెద్ద సవాలుగా మారుతుంది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆప్షన్లు ఉన్నవారు తమ షిఫ్ట్ సమయాలను మార్చుకునే అవకాశం ఉంది.

48 జట్లతో చరిత్రలోనే అతిపెద్ద వరల్డ్ కప్‌గా నిలవనున్న ఈ టోర్నీని లైవ్‌లో చూడాలనుకునే భారతీయ అభిమానులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి “పవర్ నాప్స్” (పగటిపూట చిన్న నిద్రలు) అలవాటు చేసుకోవాలని, వీలైనంత వరకు కేవలం తమకు ఇష్టమైన జట్ల మ్యాచ్‌లను మాత్రమే లైవ్‌లో చూసి, మిగిలిన వాటిని హైలైట్స్ రూపంలో చూడటం మంచిదని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment