విశాఖ స్టీల్ ప్లాంట్‌లో (Visakha Steel Plant) జరిగిన ఘోర ప్రమాదంపై రాజకీయ దుమారం మరింత ముదిరింది. ఈ ప్రమాదం వెనుక పెద్ద కుట్ర కోణం దాగుందని, ప్లాంట్‌ను ప్రైవేటీకరించే (Privatization) కుట్రల్లో భాగంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం (Coalition Government) కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ కేజీహెచ్ (KGH) వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వంపై, మంత్రి లోకేష్(Nara Lokesh) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి (TDP Alliance) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టీల్ ప్లాంట్‌ను తమ తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే ప్లాంట్‌లో పనిచేస్తున్న సమర్థులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం (Unofficial Transfers) వల్లే అక్కడ సాంకేతిక లోపాలు(Technical Failures) తలెత్తుతున్నాయని, అనుభవజ్ఞుల కొరత ఏర్పడి ఈ తరహా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
మిషనరీ నిర్వహణను (Machinery Maintenance) పూర్తిగా గాలికొదిలేశారని, ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారని బొత్స గుర్తుచేశారు. ప్రభుత్వం ఇకనైనా బలవంతపు వీఆర్‌ఎస్ (VRS) చర్యలను, ఉద్యోగుల తొలగింపును తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
లోకేష్‌కి కనీస ఓపిక, సహనం లేవు..
బాధితులను (Console Victims) పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రవర్తించిన తీరుపై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద సమస్యలపై, యాజమాన్య నిర్లక్ష్యంపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలను (Workers Union Leaders) ఉద్దేశించి మీ కుటుంబంలో ఎవరూ చనిపోలేదు కదా అని లోకేష్ అవమానించేలా మాట్లాడటం దారుణమన్నారు. అధికారంలో ఉన్నవారికి కనీస ఓపిక(Patience), సహనం (Tolerance) ఉండాలని.. అలా కాకుండా ప్రాణాలు కోల్పోయిన కార్మికుల తరఫున ఆవేదన వ్యక్తం చేసిన నేతలపై నోరుపారేసుకోవడం శోచనీయమని బొత్స దుయ్యబట్టారు.








