భారత చెస్ (India Chess) యువ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద (R. Praggnanandhaa) మరోసారి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో (Norway Chess 2026 Tournament) అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా (Champion) నిలిచిన 20 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ చరిత్ర సృష్టించాడు.
టోర్నమెంట్ చివరి రౌండ్లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై (Vincent Keymer) కీలక విజయం సాధించిన ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నార్వే చెస్ టైటిల్‌ను (Norway Chess Title) గెలిచిన తొలి భారతీయుడిగా అరుదైన ఘనత సాధించాడు. టోర్నమెంట్ మధ్యలో ఎదురైన పరాజయాలను అధిగమిస్తూ వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్‌ల్లో విజయాలు నమోదు చేసి అసాధారణ పునరాగమనం చేశాడు.
ఫైనల్ రౌండ్‌కు ముందు అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో (Wesley So) ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ప్రజ్ఞానంద తన విజయంతో పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. వెస్లీ సో మ్యాచ్ డ్రాగా ముగియడంతో కేవలం ఒక పాయింట్ తేడాతో ప్రజ్ఞానంద ఛాంపియన్‌గా అవతరించాడు.
విజయం అనంతరం స్పందించిన ప్రజ్ఞానంద, ఓటముల గురించి ఆలోచించకుండా ప్రతి గేమ్‌ను కొత్త అవకాశంగా తీసుకున్నానని తెలిపాడు. ఈ విజయంతో భారత చెస్‌కు మరో స్వర్ణ అధ్యాయం జోడించిన ప్రజ్ఞానంద, ప్రపంచ చెస్ వేదికపై భారత జెండాను (Indian Flag) మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు.








