‘పెద్ది’ తొలి రోజే భారీ వసూళ్లు

పెద్ది బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే భారీ వసూళ్లు

Summarize with AI

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘పెద్ది’(Peddi) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రేక్షకుల్లో నెలల తరబడి నెలకొన్న అంచనాలను నిజం చేస్తూ విడుదలైన తొలి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మాస్ యాక్షన్, ఎమోషనల్ కథనం, గ్రామీణ నేపథ్యంలో రామ్ చరణ్ చూపించిన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో థియేటర్ల వద్ద భారీ సందడి కనిపిస్తోంది. దీంతో ‘పెద్ది’ ఈ ఏడాది అతిపెద్ద ఓపెనింగ్స్ (Biggest Openings)సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

రామ్ చరణ్ స్టార్‌డమ్, బుచ్చిబాబు టేకింగ్, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) అందించిన సంగీతం కలిసి సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాయి. తొలి రోజే ఈ స్థాయి వసూళ్లు నమోదు కావడంతో ‘పెద్ది’ రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు (Highest Opening Collections) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరోసారి భారీ బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించిన చరణ్, ‘గేమ్ ఛేంజర్’ నిరాశను పూర్తిగా మరిపించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ‘పెద్ది’ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment