గోవా త‌ర‌హాలో ఏపీలోనూ బ‌హిరంగ మ‌ద్యం

గోవా త‌ర‌హాలో ఏపీలోనూ బ‌హిరంగ మ‌ద్యం

మద్యం అమ్మకాల (Liquor Sales) ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్రంలో ‘బీచ్ షాక్స్’ (Beach Shacks) ఏర్పాటుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ మంత్రివర్గం (Chandrababu Government Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై గోవా (Goa) తరహాలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర ప్రాంతాల్లో సైతం పర్యాటకులు బీచ్‌ను ఆస్వాదిస్తూ మద్యం సేవించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. పర్యాటకంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోందనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘బీచ్ షాక్స్’ పాలసీని తీసుకువచ్చిన‌ట్టుగా స‌మాచారం. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని రెండు ప్రముఖ బీచ్‌లలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను అమలు చేయనున్నారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ (Suryalanka Beach), వైజాగ్ బీచ్‌ల‌లో(Visakhapatnam Beach) బీచ్ షాక్స్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నారు.

ఈ రెండు ప్రాంతాల్లో మొదటగా బీచ్ షాక్స్ (ఓపెన్ రెస్టారెంట్లు/బార్లు) ఏర్పాటు చేసి, అక్కడ పర్యాటకులకు మద్యం, ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతారు. ఇక్కడ వచ్చే రెస్పాన్స్ ఆధారంగా భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ బీచ్‌లకు ఈ విధానాన్ని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ బీచ్ షాక్స్ కేవలం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అనుమతి ఉంటుంది.

విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నారా?
కూటమి ప్రభుత్వ నిర్ణయం పర్యాటక రంగానికి బూస్ట్ ఇస్తుందని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ, దీనిపై అప్పుడే సామాజిక మాధ్యమాల్లో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మద్యం అమ్మకాలను పెంచుకుని, ఖజానా (Treasury) నింపుకోవడానికే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనే ఆరోపణలు వస్తున్నాయి.

కుటుంబ సమేతంగా ప్రశాంతంగా గడపడానికి వచ్చే బీచ్‌లలో ఇలా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వడం వల్ల మహిళలు(Women), పిల్లల (Children) రక్షణకు (Safety) ముప్పు వాటిల్లుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోవా సంస్కృతిని ఏపీకి తీసుకువచ్చి తీర ప్రాంతాల్లో విచ్చలవిడితనాన్ని, అశ్లీలతను (Obscenity) ప్రోత్సహించేలా ఈ నిర్ణయం ఉందంటూ మండిపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment