విశాఖలో డాన్స్ మాస్టర్ పండు కారు ప్రమాదం..

విశాఖలో డాన్స్ మాస్టర్ పండు కారు ప్రమాదం..

టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తగరపువలస సమీపంలో జరిగిన ఓ జాతరలో డ్యాన్స్ ఈవెంట్‌లో పాల్గొన్న అనంతరం తన బృందంతో కలిసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

కారులో ఉన్న ఓ డ్యాన్సర్‌కు అస్వస్థత ఏర్పడటంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో పండు మాస్టర్‌తో పాటు మరికొందరు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు, సహచరులు గాయపడిన వారిని విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment