అమరావతి రాజధాని (Amaravati Farmers) పరిధిలో భూములు (Lands) ఇవ్వని రైతులపై (Farmers) కూటమి ప్రభుత్వం Coalition Government) బలవంతపు చర్యలకు దిగుతోందంటూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు తదితర గ్రామాల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని(Tadepalli) క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) రాజధాని రైతులు కలిశారు. ల్యాండ్ పూలింగ్ (Land Pooling), భూసేకరణ (Land Acquisition) పేరుతో ప్రభుత్వం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, తమ పొలాలను ధ్వంసం చేస్తోందని వారు జగన్‌కు మొరపెట్టుకున్నారు. తమ సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని వారు కోరారు.
దౌర్జన్యంగా లాక్కుంటున్నారు – రైతుల ఆవేదన
వైఎస్ జగన్‌తో భేటీలో రాజధాని రైతులు వారి సమస్యలను మాజీ సీఎంకు వివరించారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు.
- డెవలప్మెంట్ పనుల (Development Works) పేరుతో భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి జేసీబీలతో (JCB Machines) దూసుకొచ్చి పంటలను, పొలాలను దారుణంగా ధ్వంసం చేస్తున్నారు.
- దేవుడి భూములను (Temple Lands) కాపాడాల్సింది పోయి, వాటిని ప్లాట్లుగా మార్చి ఇస్తామంటున్నారు. దేవాలయ భూముల రక్షణలో వైఎస్ జగన్ తమకు తోడుగా నిలవాలి.
- రాజధాని పరిధిలో ఇప్పుడు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి (Steel Bridge) పూర్తిగా కుంగిపోయింది. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు, కేవలం కరకట్ట రోడ్డును విస్తరిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది ఉండదు.
- ఉండవల్లి ప్రాంతానికి సంబంధించి ఎలాంటి ‘ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (Environmental Impact Assessment – EIA), సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్’ (Social Impact Assessment – SIA) నిర్వహించకుండానే బలవంతంగా భూములు లాక్కునేందుకు నోటిఫికేషన్లు ఇస్తూ దౌర్జన్యం చేస్తున్నారు. అని రైతులు తమ సమస్యలు జగన్ కు వివరించారు.
చంద్రబాబువి అన్నీ స్కాములే.. – వైఎస్ జగన్
రైతుల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్, వారికి వైసీపీ(YSRCP) పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని, వారిని బలవంత పెట్టడం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
“మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకే ఇప్పటివరకు దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో 50 వేల ఎకరాలు అంటున్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు స్కాముల మీద స్కాములు (Scams) చేస్తున్నారు. ఏది చూసినా అవినీతే కనిపిస్తోంది. కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఇక్కడ ఎకరాకు రూ. 2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా కేవలం రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు (Drainage Systems) తవ్వడానికి, నీళ్లు (Water Supply), కరెంట్ (Electricity) ఇవ్వడానికే దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంత చేసినా భవిష్యత్తులో అక్కడ పూర్తిస్థాయి రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు” అని విమర్శించారు.
ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ కారిడార్..
చంద్రబాబుకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, అందుకే అందుబాటులో ఉన్న వనరులను వదిలేస్తున్నారని జగన్ మండిపడ్డారు. “గతంలోనే మేము ప్రత్యామ్నాయంగా ‘మావిగన్స (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు)(MAVIGUN) గ్రోత్ కారిడార్‌ను సూచించాం. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అయినా చంద్రబాబు మరొక ఎయిర్పోర్ట్ అంటున్నారు. మచిలీపట్నంలో మన హయాంలోనే పోర్టు పనులు మొదలుపెట్టి నిధుల కొరత లేకుండా చూశాం. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ‘మావిగన్’ (MAVIGUN) ప్రాంతాన్ని గ్రోత్ కారిడార్‌గా ప్రకటించి, 110 కిలోమీటర్ల మేర అటు ఇటూ కొంత డబ్బు ఖర్చు పెడితే మొత్తం కారిడార్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది” అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.








