తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana State Formation Day) సందర్భంగా హైదరాబాద్‌లోని (Hyderabad) తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)జాతీయ జెండాను (National Flag) ఆవిష్కరించి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు అభివృద్ధి (Development, సంక్షేమానికి (Welfare) దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలోకి నెట్టబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు కేసీఆర్ చేసిన కృషిని గుర్తు చేస్తూ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన జీవితాన్నే అంకితం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి సాధించిన చారిత్రక విజయమని ఆయన అన్నారు.
ప్రస్తుత పాలనపై విమర్శలు కొనసాగించిన కేటీఆర్, “పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది” అంటూ వ్యాఖ్యానించారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు (Fluoride-Affected Areas) స్వచ్ఛమైన తాగునీరు (Clean Drinking Water) అందించడం నుంచి రాష్ట్ర అభివృద్ధికి పునాది వేయడం వరకు కేసీఆర్ (KCR) చేసిన సేవలను ప్రజలు మరవలేరని చెప్పారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే విజయం సాధించిందని, 2023లో కూడా స్వల్ప తేడాతో ఓడిపోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులు తాత్కాలికమేనని, 2028లో తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చి కేసీఆర్‌ను(KCR) ముఖ్యమంత్రిగా (Chief Minister) చూడబోతున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.








