‘దగా డీఎస్సీ అతిపెద్ద మెగా స్కామ్’.. నా మీద కేసు పెడతావా..?

‘దగా డీఎస్సీ అతిపెద్ద మెగా స్కామ్’.. నాపై కేసు పెడతావా..?

కూటమి ప్రభుత్వంలో(Alliance Government) నారా లోకేష్ (Nara Lokesh) చిత్రవిచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నారని వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తన పరిధిలోని శాఖను గాలికి వదిలేసి, మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి తానేదో ఉద్ధరిస్తున్నట్లు లోకేష్ బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో(Amaravati) భూములు, కాంట్రాక్టుల పేరిట భారీగా వెనకేసుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఉపాధ్యాయుల నియామకాల్లోనూ ఇంతటి దారుణాలకు ఒడిగడతారా? అంటూ నిప్పులు చెరిగారు.

మెగా డీఎస్సీ కాదు.. అది ‘దగా డీఎస్సీ’!
16 వేల పైచిలుకు టీచర్ పోస్టుల భర్తీ పేరుతో నిరుద్యోగులను ఘోరంగా దగా చేశారని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు(Chandrababu), లోకేష్(Lokesh) కలిసి నియామకాల్లో నీచాతి నీచాలకు పాల్పడ్డారని విమర్శించారు. “మెగా డీఎస్సీ(Mega DSC) నిజంగానే పారదర్శకంగా నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు బయటపెట్టడం లేదు? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పరు.. కానీ ఫోన్లకు మాత్రం మెసేజ్‌లు పంపుతారంట. ఎంత సొమ్ము కొడితే అంత ర్యాంకు ఇస్తారా? సమాజానికి నష్టం చేస్తున్నామనే పాపభీతి కూడా మీకు లేదా?” అని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై విద్యాశాఖ నుంచి వచ్చిన నోట్ విడుదల చేసిన వాళ్లు అన్నమే తింటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తామనడం వారి నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందన్నారు.

స్పోర్ట్స్ కోటా పేరిట 421 మందికి
గతంలో ప్రతి ప్రభుత్వ సంస్థలో నియామకాలు జరిగినప్పుడు స్పోర్ట్స్ కోటా కింద 2 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని 2012లో జీవో ఇచ్చారని పేర్ని నాని గుర్తు చేశారు. అయితే ఈ ప్రభుత్వం 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4లను విడుదల చేసి కొత్త అక్రమాలకు తెరలేపిందని ఆరోపించారు.

డీఎస్సీ(DSC), టెట్ (TET) పరీక్షలు రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం అప్పటివరకు ఉన్న 29 ఆటలను ఏకంగా 67 ఆటలుగా మార్చేశారని.. బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలను ఇందులో చేర్చారని ఎద్దేవా చేశారు. ఈ దొడ్డిదారిన ఏకంగా 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయుల (PET) కింద నేరుగా రిక్రూట్ చేసుకున్నారని, ఇంతకంటే నీచం మరొకటి లేదని ధ్వజమెత్తారు.

నటుడు బాలకృష్ణ (Balakrishna) సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటే.. లోకేష్ మాత్రం ఇలాంటి స్కామ్‌లు చేసి డబ్బులు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మెగా డీఎస్సీ స్కామ్‌పై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీపై మాట్లాడితే జైల్లో వేస్తామంటున్నారని.. తాము ఇప్పుడు బహిరంగంగానే మాట్లాడుతున్నామని, దమ్ముంటే తమపై కేసులు పెట్టుకోవాలంటూ పేర్ని నాని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment