కర్నాటక సీఎం (Karnataka CM) పదవికి సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామా (Resignation) చేశారు. తాను సీఎం పదవికి రాజీనామా చేశానని సిద్ధరామయ్య తెలిపారు.హైకమాండ్ (High Command) ఆదేశాలకు అనుగుణంగానే రాజీనామా చేశా: సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రస్తుతం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా (Chief Minister) బాధ్యతలు చేపట్టనున్నట్లు జాతీయ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.
అసలు పేరు దొడ్డలహಳ್ಳಿ కెంపేగౌడ శివకుమార్ (Doddalahalli Kempegowda Shivakumar) అయిన ఆయన 1962 మే 15న కర్ణాటకలోని కనకపుర సమీపంలోని దొడ్డలహళ్లిలో జన్మించారు. రైతు కుటుంబంలో జన్మించిన డీకే శివకుమార్ చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారు. విద్యాభ్యాసం కనకపురలో ప్రారంభమై తర్వాత బెంగళూరులో కొనసాగింది. ఆయన డిగ్రీ చదివిన తర్వాత వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి, విద్యాసంస్థలు మరియు వ్యాపార వ్యవహారాలను నిర్వహించారు. రాజకీయాలపై ఆసక్తితో యువకుడిగానే కాంగ్రెస్ పార్టీలో చేరి విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారు.
డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం 1980లలో ప్రారంభమైంది. 1989లో కనకపుర నియోజకవర్గం (Kanakapura Constituency) నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా(MLA) విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు. తర్వాత అనేకసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ కాంగ్రెస్ పార్టీకి (Congress Party) కష్టకాలంలో ప్రధాన బలంగా నిలిచారు. కర్ణాటక కాంగ్రెస్‌లో “ట్రబుల్ షూటర్”(Troubleshooter)గా పేరుగాంచిన ఆయన, సంక్షోభ సమయంలో ఎమ్మెల్యేలను కాపాడటం, పార్టీని ఏకం చేయడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు.
జలవనరులు(Water Resources), బెంగళూరు అభివృద్ధి (Bengaluru Development) వంటి శాఖలకు మంత్రిగా పనిచేసి పరిపాలనలో తన ముద్ర వేశారు. 2020లో కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీని బలోపేతం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ప్రధాన వ్యూహకర్తగా నిలిచిన డీకే శివకుమార్ అనంతరం ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కుటుంబ విషయానికి వస్తే డీకే శివకుమార్ భార్య పేరు ఉషా శివకుమార్(Usha Shivakumar). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి రాజకీయ, వ్యాపార రంగాల్లో మంచి ప్రభావం ఉంది. ఆయన సోదరుడు డీకే సురేష్ (DK Suresh) కూడా రాజకీయ నాయకుడిగా పనిచేశారు. డీకే శివకుమార్ తన ఆస్తులు, వ్యాపారాలు, విద్యాసంస్థల కారణంగా కర్ణాటకలో అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, ఈడీ విచారణలు వంటి వివాదాలు కూడా ఆయన రాజకీయ జీవితంలో చర్చనీయాంశమయ్యాయి. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత నమ్మకమైన నాయకుడిగా, గ్రౌండ్ లెవెల్‌లో బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.








జనసేన నేత బూతు పురాణం.. ప్రెస్మీట్లోనే తిరగబడ్డ జర్నలిస్టులు (Video)