ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) దేశంలోనే అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు (Supreme Court) సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు (Siddharth Luthra) మరోసారి భారీ మొత్తంలో ఫీజులను(Fees) ప్రభుత్వ ఖజానా (Government Treasury) నుంచి విడుదల చేసింది. వివిధ కేసుల్లో ప్రభుత్వం తరఫున కోర్టుల్లో హాజరైనందుకు గాను లూథ్రాకు రూ.44 లక్షలు చెల్లించేందుకు ఇవాళ ఒక్కరోజే ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను (GOs) జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు ఫీజుల చెల్లింపుల కోసం న్యాయశాఖ రెండు జీవోలను విడుదల చేసింది. మొదటి జీవోలో రూ.33 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రెండో జీవోలో రూ.11 లక్షలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ రెండేళ్లలో సిద్ధార్థ్ లూథ్రాకు రాష్ట్ర ఖజానా నుంచి రూ.13 కోట్లకు పైగా చెల్లించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి ఒకే లాయర్‌కు ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నిధుల విడుదలపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
చంద్రబాబుకు బెయిల్ ఇప్పించిన లూథ్రా
సిద్ధార్థ్ లూథ్రా పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత రెండేళ్లుగా మారుమోగిపోతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో.. అత్యంత సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Development Scam Case) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అరెస్ట్ అయినప్పుడు, ఆయన తరఫున ప్రైవేట్ న్యాయవాదిగా సిద్ధార్థ్ లూథ్రానే కోర్టుల్లో ప్రధానంగా వాదనలు వినిపించారు.
నాడు చంద్రబాబు వ్యక్తిగత కేసులను వాదించిన లూథ్రాకు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారిక కేసులను అప్పగించడం, దానికి బదులుగా ప్రభుత్వ నిధుల నుంచి కోట్ల రూపాయలను ఫీజులుగా చెల్లిస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజాధనాన్ని లాయర్ల ఫీజుల కోసం యధేచ్ఛగా వాడుకుంటున్నారంటూ విపక్ష నేతలు మండిపడుతున్నారు.
అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాకు మరోసారి ప్రభుత్వ నిధులు
— Telugu Feed (@Telugufeedsite) May 26, 2026
రూ.44 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు
రూ.33 లక్షలు, రూ.11 లక్షలు చొప్పున విడుదలకు రెండు జీవోలు విడుదల
పలు కేసుల్లో ప్రభుత్వం తరఫున హాజరైనందుకు ఫీజులు చెల్లింపు
ఇప్పటికే రూ.13 కోట్లకుపైగా సిద్ధార్థ లూథ్రాకు… https://t.co/XBN9NFGco7 pic.twitter.com/h2Xnm4VVtI








సుగాలి ప్రీతి కేసును పవన్ రాజకీయానికి వాడుకున్నాడు