కిరణ్ అబ్బవరం మూవీకి మణిశర్మ మ్యాజిక్.. వైరల్ అవుతున్న ‘వదలనే..’

కిరణ్ అబ్బవరం మూవీకి మణిశర్మ మ్యాజిక్.. వైరల్ అవుతున్న ‘వదలనే..’

Summarize with AI

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా ఎమోషనల్ లవ్ స్టోరీ ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) ఇప్పుడు మ్యూజిక్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ కేఎన్ (SKN)– సాయి రాజేశ్ (Sai Rajesh) కాంబినేషన్‌లో మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ ‘వదలనే..’ (‘Vadalane’) పాటను హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌లో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) చేతుల మీదుగా లాంచ్ చేయడం విశేషం. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ పాట ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఈ ఈవెంట్‌లో అనూప్ రూబెన్స్, వివేక్ సాగర్, కళ్యాణి మాలిక్ వంటి పలువురు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “ఇటీవల మణిశర్మ గారి నుంచి ప్యూర్ మెలొడీస్ మిస్ అవుతున్నాం. అందుకే ఈ సినిమాలో ఏకంగా 7 మెలొడీ సాంగ్స్ చేయించుకున్నాం” అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ.. “పాండిచ్చేరిలో (Pondicherry) చిత్రీకరించిన ఈ పాటలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలిస్తాయి. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ పాట హాంట్ చేస్తూనే ఉంటుంది” అని చెప్పాడు. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ కూడా మణిశర్మ సంగీతంలో నటించడం తన అదృష్టమని ఆనందం వ్యక్తం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment