ఏపీ ఆర్థిక మంత్రి కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ (YSRCP) సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి (Y. Vishweshwar Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన తండ్రి, సోదరుడి దారుణ హత్యల (Brutal Murders) వెనుక మంత్రి పయ్యావుల కేశవ్ హస్తం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
హత్యా రాజకీయాల చరిత్ర పయ్యావులదే..
ఉరవకొండలో (Uravakonda) ఫ్యాక్షనిజం, హత్యా రాజకీయాలను ప్రవేశపెట్టింది పయ్యావుల కేశవ్ కుటుంబమేనని వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పయ్యావుల కుటుంబ గత చరిత్రను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దొంగ సారా(Illicit Liquor), కల్తీ కల్లు (Adulterated Toddy) విక్రయించిన చరిత్ర మంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబానిదేనని.. గతంలో పయ్యావుల తాత, తండ్రి చేసిన దుర్మార్గాలపై కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశాయని గుర్తు చేశారు.
పయ్యావుల కుటుంబ ఆగడాలపై ఆందోళన చేపట్టినందుకే.. తన తండ్రి రాకెట్ల నారాయణ రెడ్డి(Rockets Narayana Reddy), తన సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డిలను (Ravindranath Reddy) దారుణంగా హతమార్చారని విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “గతంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) జెండా(Flag) కట్టినందుకు సూరి (Suri) అనే 40 ఏళ్ల పిల్లోడ్ని పొట్టపగిలేలా హత్య చేయించింది వాస్తవం కాదా? ఆ గ్రామాల్లో కొమ్మేసే మాల చౌడప్పను హత్య చేయించింది మీరు కాదా పయ్యావుల కేశవ్? మీ దౌర్జన్యాలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి” అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
“వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) విమర్శించే అర్హత మంత్రి పయ్యావుల కేశవ్‌కు లేదు. నీ కుటుంబ చరిత్ర ఏంటో ముందు తెలుసుకో? జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఫ్యాక్షనిజానికి (Factionism) వ్యతిరేకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు (Law and Order) పారదర్శకంగా ఉన్నాయి” అంటూ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా తండ్రి, సోదరుడి దారుణహత్య వెనుక మంత్రి పయ్యావుల కేశవ్ హస్తం
— Telugu Feed (@Telugufeedsite) May 25, 2026
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర మంత్రి @PayyavulaOffl కుటుంబానిదే
పయ్యావుల కేశవ్ తాత, తండ్రి దుర్మార్గాలపై కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున… pic.twitter.com/q02NQ1sB3n








