మెలోని పెళ్లి చేసుకున్నారా?.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ ప్రశ్న ఇదే!

మెలోని పెళ్లి చేసుకున్నారా?.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ ప్రశ్న ఇదే!

Summarize with AI

ఇటలీ (Italy) ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రధాని నరేంద్ర మోడీతో (Narendra Modi) కలిసి కనిపించిన ‘మెలోడీ’ వీడియో (Melodi Video) ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా “మెలోని పెళ్లి (Marriage) చేసుకున్నారా?”, “ఆమె ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నారా?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గంటల వ్యవధిలోనే కోట్ల వ్యూస్ సాధించిన ఈ వీడియోతో మెలోని పేరు అంతర్జాతీయంగా మరింత పాపులర్ అయింది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జార్జియా మెలోని ఇప్పటివరకు అధికారికంగా వివాహం చేసుకోలేదు. అయితే ఇటలీ టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా జియాంబ్రునోతో(Andrea Giambruno) ఆమె చాలా కాలం రిలేషన్‌లో ఉన్నారు. 2014లో ప్రారంభమైన వీరి పరిచయం తర్వాత ఇద్దరూ కలిసి జీవించగా, 2016లో వారికి గినెవ్రా అనే కుమార్తె జన్మించింది. కుటుంబ విలువలు, మాతృత్వం, క్రమశిక్షణ వంటి అంశాలను మెలోని ఎప్పుడూ తన రాజకీయ జీవితంలో ప్రాధాన్యంగా చూపించేవారు. 2022లో ఆమె పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జియాంబ్రునో కూడా పలుమార్లు మెలోనితో పబ్లిక్ ఈవెంట్లలో కనిపించారు.

అయితే 2023లో జియాంబ్రునోకు సంబంధించిన కొన్ని వివాదాస్పద వీడియోలు బయటకు రావడంతో వీరి సంబంధం ముగిసింది. మహిళా సహచరులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇటలీలో పెద్ద దుమారానికి దారితీశాయి. అనంతరం మెలోని విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె సింగిల్ మదర్‌గా తన కుమార్తెను చూసుకుంటూనే, యూరప్‌లో అత్యంత ప్రభావశీల మహిళా నాయకుల్లో ఒకరిగా ఇటలీ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ‘మెలోడీ’ మీమ్స్ కారణంగా మెలోని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఫేవరెట్‌గా మారిపోయారు.

Join WhatsApp

Join Now

Leave a Comment