ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధి హోంమంత్రిగా ఉన్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఘోర సంఘటన జరిగింది. 11 ఏళ్ల దళిత బాలికపై (Dalit Girl) సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడిన ఘటన ఆలస్యంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా.. హోంమంత్రి (Home Minister) నియోజకవర్గం కావడంతో బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగింది?
7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై ఈనెల 17న ఇద్దరు వ్యక్తులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన సమయంలో నిందితులు బాలికను బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని తీవ్రంగా బెదిరించారు. అయితే, బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి, ఆమెను గట్టిగా ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఈనెల 20న పాయకరావుపేట (Payakaraopeta) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ అమానుష ఘటనలో నిందితులుగా నక్కా చిన్నబ్బాయి (Nakka Chinnabbayi) (60), పెదపాటి జోగి (Pedapati Jogi) (45)లతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, కేసును అత్యంత గోప్యంగా ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి సొంత నియోజకవర్గం కావడంతోనే ఈ ఘటనను బయటి ప్రపంచానికి తెలియకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) మహిళా భద్రతకు (Women Safety) పెద్దపీట వేస్తామని చెబుతున్నప్పటికీ, హోంమంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి దారుణాలు జరగడం, దానికి తోడు కేసును బయటకు తెలియకుండా పోలీసులు వ్యవహరిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.







