ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu Naidu) తనయుడునారా లోకేష్(Nara Lokesh)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల పబ్లిక్ మీటింగ్స్‌లో మంత్రి లోకేష్ “Both are not the same” డైలాగులకు వ్యాఖ్యలపై జగన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. “మిస్టర్ లోకేష్.. ఎస్, Both can never be same! రెండు ప్రభుత్వాలు ఎప్పటికీ ఒకటి కాలేవు” అంటూ ఇరు పార్టీల చరిత్ర, క్యారెక్టర్, పాలనా తీరుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు ఒకవైపు దారుణమైన పరిపాలన సాగిస్తూ.. మరోవైపు తన కొడుకు చేత బాలకృష్ణ Balakrishna) డైలాగులు చెప్పించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసాలను జగన్ పాయింట్ల వారీగా వివరించారు.
“వెన్నుపోటు పొడిచి సొంత పార్టీని, పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఒంటరిగా ఎదురొడ్డి నిలబడి, ప్రజా మద్దతు సంపాదించి, పారదర్శకంగా ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. Both can never be same.”
“ప్రజలను నమ్మించి ముంచడం, వారికి ద్రోహం చేయడం మీ క్యారెక్టర్. ఆరు నూరైనా సరే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.”
“పనులు చేసి చూపించడం మా స్టైల్. పబ్లిసిటీతో (Publicity) ఇతరుల క్రెడిట్‌ను చోరీ చేయడం మీ స్టైల్. Both can never be same.”
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (YSRCP Government) విద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, గృహనిర్మాణం, మహిళా సాధికారిత రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని జగన్ గుర్తుచేశారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన ‘దిశ’(Disha) లాంటి కార్యక్రమాలు తమ చరిత్ర అయితే, వాటన్నింటినీ నాశనం చేయడం కూటమి ప్రభుత్వ చరిత్ర అని ఆయన ఆరోపించారు.
“మా ఐదేళ్ల పాలనలో అర్హులైన పేదలకు ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా వారి ఇంటి వద్దకే డీబీటీ (Direct Benefit Transfer) కింద రూ.2.73 లక్షల కోట్లు అందించాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రూ.3.6 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six), సూపర్ సెవెన్ హామీలను గాలికి వదిలేసి దోపిడీకి పాల్పడుతోంది” అని జగన్ మండిపడ్డారు.
“బాబు అంటే మోసం.. జగన్ అంటే నమ్మకం. Yes Lokesh, both can never be same” అంటూ నారా లోకేష్‌కు వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. both can never be same వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లోకేష్.. Both can never be Same
— Telugu Feed (@Telugufeedsite) May 21, 2026
ఈ మధ్యకాలంలో లోకేష్ బాలకృష్ణ డైలాగులు కొడుతున్నాడు
అయ్యా లోకేష్.. Both can never be Same.. తెలుసుకో..
– మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/7d2JKqiNzM








హద్దులు దాటిన మాటలు.. ప్రొఫెసర్‌పై బాడీ షేమింగ్