‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్‌’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?

‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్‌’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఊహించని రీతిలో దూసుకుపోతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్‌రోచ్‌ జనతా పార్టీ’ (Cockroach Janata Party – CJP) కి కేంద్ర ప్రభుత్వం నుండి గట్టి షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దేశ అధికార పార్టీ అయిన బీజేపీ (Bharatiya Janata Party) అధికారిక ఖాతా కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని సరికొత్త రికార్డు సృష్టించిన కొద్ది గంటల్లోనే.. ఈ కాక్రోచ్ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా (X/Twitter Account) భారతదేశంలో (India) బ్లాక్‌ అయ్యింది (Blocked).

‘లీగల్ డిమాండ్’ కారణంగానే బ్లాక్!
ప్రస్తుతం ఎక్స్‌లో @CJP_2029 అనే యూజర్‌నేమ్‌తో ఉన్న ఈ ఖాతాను ఓపెన్ చేస్తే.. ‘అకౌంట్ విత్‌హెల్డ్'(Account Withheld) అని బోల్డ్ అక్షరాలతో కనిపిస్తోంది. “ఒక చట్టపరమైన డిమాండ్ కారణంగా భారతదేశంలో ఈ ఖాతాను నిలిపివేసాం” అని ఎక్స్ యాజమాన్యం (X Management) స్పష్టం చేసింది. సాధారణంగా ప్రభుత్వ అధికారిక సంస్థల నుండి చట్టపరమైన అభ్యర్థనలు వచ్చినప్పుడు లేదా నిబంధ‌న‌ల ఉల్లంఘన జరిగిందని భావించినప్పుడు మాత్రమే నిర్దిష్ట దేశ పరిధిలో ఎక్స్ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది.

“ఓన్ గోల్” అన్న వ్యవస్థాపకుడు!
ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడంపై సంస్థ వ్యవస్థాపకుడు, స్టూడెంట్ లీడర్ అభిజీత్ దీప్కే (Abhijeet Deepke) ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ఎక్స్ అకౌంట్ బ్లాక్ అయిన స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ.. “మేం ముందే ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఇండియాలో నిలిపివేశారు. అసలు మాకంటే వాళ్లు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.

NEET పరీక్ష పేపర్ లీకేజీల (Paper Leaks) నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామాను డిమాండ్ చేస్తూ తాము పోస్టులు పెట్టినందుకే ఈ చర్య తీసుకున్నారా? అని ఆయన నిలదీశారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి స్వయంకృతాపరాధమే అని, దీనివల్ల తమకు ఆన్‌లైన్‌లో మరింత క్రేజ్ పెరుగుతుందని అభిజీత్ వ్యాఖ్యానించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీపై ‘జైత్రయాత్ర’
ట్విట్టర్‌లో ఈ పార్టీకి బ్రేకులు పడినప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) మాత్రం దీని జోరు అస్సలు తగ్గడం లేదు. కేవలం 4-5 రోజుల్లోనే ఈ వ్యంగ్య పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 13.5 మిలియన్ల (1.35 కోట్లు) ఫాలోవర్లను దాటేసింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీకి(bjp) 8.8 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉండగా.. ఈ ‘బొద్దింకల పార్టీ’(Cockroach Party) ఆ సంఖ్యను ఎప్పుడో దాటేసి దూసుకుపోతోంది. అయితే, ఎక్స్ ఖాతా బ్లాక్ అయిన కొద్దిసేపటికే తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, లాగిన్ సమస్యలపై ఇన్‌స్టాగ్రామ్ నుండి అలర్ట్ ఈమెయిల్స్ వస్తున్నాయని అభిజీత్ దీప్కే ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment